తన ఫామ్‌పై వస్తున్న అనేక విమర్శలకు రోహిత్ శర్మ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. వాంఖడే వేదికగా పరుగుల వరద పారించాడు. చెన్నైని చిత్తు చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. దీంతో వరుస ఓటముల నుంచి ముంబై బయటపడినట్టైంది. చెన్నై మాత్రం పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగుకు వెళ్లిపోయింది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన CSK.. అందులో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
ముంబైకి ఇది హ్యాట్రిక్ విజయం. మొదట బ్యాటింగ్ చేసి చెన్నై 5 వికెట్లు నష్టపోయి 176 పరుగులు ఏసింది. శివ్ దూబె, రవీంద్ర జడేజాలు హాఫ్ సెంచరీలతో చెన్నై పరువు కాపాడారు. ఇక తొలి మ్యాచ్ ఆడిన ఆయుష్ మాత్రమే 32 పరుగులతో సత్తా చాటాడు. రచిన్ రవీంద్ర, షేక్ రషీద్ దూకుడుగా ఆడలేకపోయారు. అశ్వని కుమార్‌లో మాత్రే వరుసగా బాదిన 4, 6, 6 హైలేట్ అని చెప్పాలి. ఈ ఇన్నింగ్స్‌లో మరో హైలేట్ 16వ ఓవర్. అశ్వని కుమార్ వేసిన ఈ ఓవర్‌లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్ బాది 24 పరుగులు చేశాడు దూబే. చివరల్లో జడేజా మెరుపులతో స్కోర్ 170 దాటింది.
ఇక చేజింగ్‌కు దిగిన ముంబై ఆటే హైలేట్ అని చెప్పాలి. రోహిత్ చెన్నైపై చెలరేగిపోయాడు. స్టారింగ్ నుంచే సిక్స్‌లతో అలరించాడు. రికిల్‌టన్ కూడా ధాటిగా ఆడాడు. కానీ జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరి దగ్గర దొరికిపోయాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ కూడా విధ్వంసాన్ని సృష్టించాడనే చెప్పాలి. నూర్ అహ్మద్ బౌలింగ్‌లోనే హ్యాట్రిక్ ఫోర్లు బాది.. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఓ వైపు సూర్య కుమార్, మరోవైపు రోహిత్ పోటీ పడి బౌండరీలు బాదడంతో మరో 26 బాల్స్ మిగిలి ఉండగానే విక్టరీ సాధించింది ముంబై ఇండియన్స్.