34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

కోహ్లీ, పడిక్కల్ దంచేశారు.. పంజాబ్‌ను ఓడించారు..

సొంత గడ్డపై ఏ పంజాబ్ కింగ్స్‌పై అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిందో.. అదే బెంగళూరు పంజాబ్‌ను వారి సొంత గడ్డపై మట్టి కరిపించింది. సొంత గడ్డపై తప్ప.. ఇతర వేదికల్లో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలుస్తుంది అనే వాదనను నిజం చేసింది RCB. అటు బౌలింగ్‌లోనూ.. ఇటు బ్యాటింగ్‌లోనూ ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో 7 వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది RCB.

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌.. 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. కృనాల్, సుయశ్ శర్మ, భువనేశ్వర్ పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రభ్‌సిమ్రన్, శశాంక్‌ సింగ్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేయగలిగారు.

158 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన RCBకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. సాల్ట్‌ తొలి ఓవర్‌లోనే వెనుదిరిగినా.. కోహ్లీ, పడిక్కల్ మాత్రం క్రీజులో పాతుకుపోయారు. కోహ్లీ స్ట్రైక్ రోటెట్ చేస్తుంటే.. పడిక్కల్ ధనాధన్ షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 103 పరుగుల పాట్నర్‌షిప్ ఇచ్చారు. కోహ్లీ మాత్రం ఆచితూచి ఆడుతూ.. బెంగళూరును గెలుపు తీరాల వరకు తీసుకెళ్లాడు. 43 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. ఆ తర్వాత రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. 54 బంతుల్లో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

కోహ్లీ రికార్డ్..

ఐపీఎల్‌లో 50+ స్కోర్ చేయడం ఇది 67వ సారి. 260 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు కోహ్లీ. ఇందులో 8 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు ఈ రికార్డ్ డేవిడ్ వార్నర్‌ పేరుపై ఉండేది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com