34.5 C
Hyderabad
Friday, October 30, 2026

Live Video

spot_img

విజయసాయికి కసిరెడ్డి ఘాటు కౌంటర్‌

ఏపీలో లిక్కర్‌ స్కామ్‌ ఇష్యూ ప్రకంపనలు సృష్టిస్తున్న సమయంలో ఆ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ఒక్కసారిగా బయటకు వచ్చారు. అయితే, వ్యక్తిగతంగా కాదు.. వీడియో రూపంలో కూడా కాదు.. ఆడియో రూపంలో మీడియాకు ఓ వివరణ పంపించారు. ఈ క్రమంలో.. మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

లిక్కర్‌ స్కామ్‌ను విచారిస్తోన్న సిట్‌.. గత కొంత కాలంగా కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి గురించి అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు నోటీసులు జారీచేసింది. విచారణకు తమ ముందు హాజరు కావాలని రెండు సార్లు నోటీసులిచ్చింది. ఒకసారి ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు అందించగా.. మరోసారి ఆయన ఈ-మెయిల్‌కు నోటీసులు పంపించింది. కానీ, అప్పటినుంచి కనిపించకుండా పోయిన కసిరెడ్డి.. అకస్మాత్తుగా ఆడియో రిలీజ్‌ చేశారు. ఆ ఆడియోలో మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డికి.. కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. శుక్రవారం సిట్‌ విచారణకు హాజరైన తర్వాత విజయ సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో, శనివారం కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ఓ ఆడియో రిలీజ్‌ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ సిట్‌ నోటీసులు ఇవ్వడం, మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తనపై చేసిన విమర్శలపై ఆ ఆడియోలో మాట్లాడారు. తాను లీగల్‌ అంశాలపై ప్రస్తుతం తలమునకలై ఉన్నానని.. అన్నింటిపైనా క్లారిటీ వచ్చాక.. సిట్‌ విచారణకు హాజరు కావడంతో పాటు.. విజయ సాయిరెడ్డి విమర్శలకు కూడా క్లారిటీ ఇస్తానని, ఆయన బండారం కూడా బయట పెడతానని వ్యాఖ్యానించారు.

కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి విడుదల చేసిన ఆడియోలో… పలు అంశాలు వెల్లడించారు. మార్చి చివరి వారంలో తాను లేనప్పుడు సిట్‌ అధికారులు తమ ఇంటికి వచ్చి.. తన తల్లికి నోటీసు ఇచ్చారని, ఆ నోటీసుల్లో తనను సాక్షిగా చేర్చారని పేర్కొన్నారు. అయితే, తాను 24 గంటల్లో రెస్పాండ్‌ అయ్యానని కసిరెడ్డి చెప్పారు. తాను విచారణకు హాజరవుతాను.. కానీ, తనను ఎందుకు రమ్మంటున్నారో.. వాళ్ల దగ్గరున్న ఆధారాలేంటో ఇవ్వాలని ఈ మెయిల్‌ ద్వారా అడిగానన్నారు. అయితే, అదే మెయిల్‌కు మరోసారి నోటీసు పంపించారని తెలిపారు. మరుసటి రోజు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారని అయితే, ఈ నోటీసులపై తన లీగల్‌ టీమ్‌తో చర్చించానని, లన లీగల్‌ టీమ్‌ సలహా మేరకు హైకోర్టును ఆశ్రయించానని, ఆ తర్వాత ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశానని ఆడియోలో చెప్పారు. ప్రస్తుతం తాను లీగల్‌ క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నానని, త్వరలోనే సిట్‌ విచారణకు హాజరవుతానని, ఆ తర్వాత.. మీడియా ముందుకు వచ్చి అన్ని అంశాలపైనా క్లారిటీ ఇస్తానన్నారు. అలాగే, తనపై విమర్శలు చేసిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి బండారం కూడా బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com