ఈవారం పండగలు–పర్వదినాలు…
20, ఆదివారం, భాను సప్తమి.
24, గురువారం, మతత్రయ ఏకాదశి
26, శనివారం, మాస శివరాత్రి.
మేషం… (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఉత్సాహపూరితంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్లుగా మీరు తలపెట్టిన కార్యాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. శత్రువులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. మీ నేర్పు, ఓర్పు ఆయుధాలుగా ఉపయోగపడతాయి. జీవితాశయం నెరవేరే సమయం. అవసరాలకు తగినంత సొమ్ము అందుతుంది. ఎంతోకాలంగా పెండింగ్లో పడిన బకాయిలు అందుతాయి. కుటుంబంలోని అందరి ఆప్యాయత, అనురాగం పొందుతారు. శారీరక రుగ్మతలు తొలగుతాయి. వ్యాపారులు లాభాలు గడించేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి. పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి పేరుగడిస్తారు. పారిశ్రామికవేత్తలు,కళాకారులకు నూతనోత్సాహం. 20,21 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు.కొన్ని వివాదాలు నెలకొని ఇబ్బందిపడతారు. కీలక నిర్ణయాలలో మార్పులు. నృసింహస్తోత్రాలు పఠించండి.
వృషభం… (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
వీరికి అన్నీ శుభశకునాలే. ఆలోచనలు అమలు చేసి ముందడుగు వేస్తారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. చేజారిన సొమ్ము కూడా అందే సూచనలు. ఆదాయం కూడా కొంత పెరుగుతుంది. శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు సంతానానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. విదేశాలలో ఉన్న ఒకరు స్వదేశానికి రావచ్చు. కొద్దిపాటి రుగ్మతలు ఎదుర్కొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరి లాభాలు అందుతాయి. ఉద్యోగులు మీ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. ప్రమోషన్లు దక్కవచ్చు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 23,24 తేదీల్లో ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధువులతో విరోధాలు. చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మిథునం… (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఎంతటి కార్యాన్నైనా దీక్షతో పూర్తి చేస్తారు. మీపట్టుదల, నైపుణ్యతను అందరూ గుర్తిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఉపశమనం పొందుతారు.వేడుకల్లో పాల్గొంటారు.విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.పెండింగ్బాకీలు కూడా అప్రయత్నంగా వసూలవుతాయి. ఇబ్పందులు తొలగుతాయి. కుటుంబంలోని అందరితోనూ మీ భావాలను పంచుకుంటారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మిమ్మల్ని వ్యతిరేకించినవారు సైతం మద్దతుగా నిలుస్తారు. సంతానం విదేశీ పర్యటనలకు ఏర్పాట్లు చేస్తారు.ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. విస్తరణలో ముందడుగు వేస్తారు.ఉద్యోగులకు శ్రమ వృథా కాదు. మీసేవలకు తగిన గుర్తింపు రాగలదు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. 22,23 తేదీల్లో వ్యాపారాలలో నిరాశ. కొన్ని పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. కాలభైరవాష్టకం పఠించండి.
కర్కాటకం… (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఎంతోకాలంగా నిరీక్షణ ఫలించి నిరుద్యోగులు సంతోషిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవమర్యాదలు పొందుతారు. మీమాటకు తిరుగులేదన్నట్లుగా ఉంటుంది. శత్రువులను కూడా ఆకర్షిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మీ జీవితంలో ఒక సంఘటన మలుపు తిప్పవచ్చు. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. రుణాలు తీరి ఉపశమనంపొందుతారు. మరింత ధనలాభాలు కలుగుతాయి. సోదరీసోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. అలాగే, శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానపరంగా కొంతకాలంగా ఎదురవుతున్న సమస్యలు తీరతాయి. ఆరోగ్యసమస్యల నుంచి గట్టెక్కుతారు. మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది.వ్యాపారాలు కొత్తపెట్టుబడులతో మరింతగా విస్తరిస్తారు. ఆశించిన లాభాలు కూడా దక్కుతాయి.ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉంటాయి. విధి నిర్వహణలో భయాందోళనలు తొలగుతాయి. అప్రయత్నంగా దక్కుతాయి. 25,26 తేదీల్లో ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
సింహం… (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
వ్యూహాత్మక వైఖరితో శత్రువులను కూడా మెప్పిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు.పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో అడుగు ముందుకు వేస్తారు.ఆలయాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. సోదరుల నుంచి కూడా సహాయం అందుతుంది. కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. కొద్దిపాటి రుగ్మతలు కొంత బాధిస్తాయి.వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు తథ్యం. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు దక్కే అవకాశం.రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు జరుగుతాయి. విదేశీ యానం. 20,21 తేదీల్లో మిత్రులు, బంధువర్గంతో విరోధాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. గణేశాష్టకం పఠించండి.
కన్య… (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం రాగలదు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు మరింత ఉత్సాహం. ఎంతోకాలంగా రావలసిన సొమ్ము అందుతుంది. ఆకస్మిక ధనలాభాలు. కుటుంబంలో మీ ఊహలు నిజం కాగలవు. బంధువులు, సోదరులతో సఖ్యత. అస్వస్థత నుంచి కోలుకుంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. కొత్త భాగస్వాములు చేరిక సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగాలలో ఒక సమాచారం ఊరటనిస్తుంది. ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలం. 21,22 తేదీల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
తుల… (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఎంతటి నిర్ణయమైనా మరో ఆలోచన లేకుండా తీసుకుంటారు. భవిష్యత్తుపై విద్యార్థులకు భరోసా కలుగుతుంది.మీ సూచనల మేరకే కుటుంబసభ్యుల నిర్ణయాలు ఉండడం విశేషం.కీలక పదవుల్లో ఉన్నవారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.మీరు గతంలో చేసిన త్యాగాలు ఇప్పుడు ఫలితాలనిస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగి ఊపిరిపీల్చుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు దక్కే ఛా¯Œ్స. చిరకాల ప్రత్యర్థులు వైరం మరిచి మీ వెంటే నడుస్తారు. ఆస్తుల కొనుగోలులో ప్రతిష్ఠంభన తొలగుతుంది. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. తెలివితేటలు, ప్రతిభ చూపి నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు. పారమార్థిక చింతన పెరుగుతుంది. తరచూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురైనా ఆహార నియమాల ద్వారా ఉపశమనం పొందుతారు. ఆహ్వానాన్ని మన్నించి ప్రముఖులు మీ ఇంటికి రావడం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారపరంగా నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఉద్యోగపరంగా కొంతకాలంగా నెలకొన్న సమస్యలు తీరతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, వైద్యులకు ఊరట కలుగుతుంది. 23,24 తేదీల్లో మానసిక అశాంతి.ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది. పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఆంజనేయదండకం పఠించండి.
వృశ్చికం… (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. కష్టమే తప్ప ఫలితం కానరాదు. విచిత్ర సంఘటనలు మరింత ఆకట్టుకుంటాయి. ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. నిరుద్యోగులకు ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.అనుకున్న సొమ్ము అందక రుణాలు చేయాల్సివస్తుంది. కొంత సొమ్ము వృథా కాగలదు. కుటుంబసభ్యులతో వైరం. బంధువుల తాకిడి పెరుగుతుంది. అలాగే,కొన్ని విషయాలలో పరీక్షాసమయంగా ఉంటుంది. తరచూ ఆస్పత్రుల సందర్శనం. ఔషధసేవనం తప్పకపోవచ్చు. వ్యాపారాలలో సామాన్యమైన లాభాలు అందుకుంటారు. విస్తరణయత్నాలలో అవాంతరాలు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు, మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు గందరగోళంగా ఉంటుంది. 20,21 తేదీల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. కుటుంబసమస్యల పరిష్కారం. గణేశాష్టకం పఠించండి.
ధనుస్సు… (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
వ్యయప్రయాసలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఇంతకాలం క్షణం తీరికలేకుండా గడిపిన మీరు కొంత ఊరట చెందుతారు. ఎంతటి కార్యక్రమమైనా దీక్ష, పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబపరంగా అందరి ప్రేమను పొందుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఎంతగానో ఉపకరిస్తాయి. విద్యార్థులు నూతన విద్యావకాశాలు అవలీలగా దక్కించుకుంటారు. తరచూ తీర్థయాత్రలు సాగిస్తూ, ఆధ్యాత్మికవేత్తలతో సమావేశమవుతారు. ఆరోగ్యపరంగా శ్రద్ధ చూపుతూ, ఆహార నియమాలు, వేళకు వ్యాయామం వంటివి మర్చిపోవద్దు. ఆస్తులు కొనుగోలులో ఇంతకాలం పడ్డ ఇబ్బందులు తీరతాయి. అనుకున్నంత రాబడి పొంది అప్పులు కూడా తీరుస్తారు. వ్యతిరేక పరిస్థితులను అధిగమిస్తూ మీకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటారు. కాంట్రాక్టర్లకు శుభదాయకమైన కాలమే. వ్యాపారపరంగా తమ సంస్థలను మరింత విస్తరిస్తారు. ఉద్యోగపరంగా చూస్తే ఎటువంటి బాధ్యతనైనా తేలిగ్గా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ, కళారంగం వారు తమ నైపుణ్యతను చాటుకుంటూ ముందుకు సాగుతారు. 24,25 తేదీల్లో శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. మిత్రులు కూడా శత్రువులుగా మారతారు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ. రామస్తోత్రాలు పఠించండి.
మకరం… (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
మీ మంచితనం, సహనమే మీకు అండగా నిలుస్తుంది. సమాజంలో మీరంటే గౌరవం పెరుగుతుంది. ఊహించని విధంగా చిరకాల స్వప్నం నెరవేరుతుంది. విద్యార్థులు లక్ష్యాల బాటలో పయనిస్తారు. సోదరీ,సోదరుల మధ్య మరింతగా ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుటుంబపరంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మలచుకోవడంలో విజయం సాధిస్తారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కి నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. పండిత సభలు, తర్కాలలో పాల్గొని మీ వాక్పటిమను నిరూపించుకుంటారు. శత్రువులుగా భావిస్తున్న వారు సైతం మీకు మద్దతుగా నిలవడం విశేషం. వాహనాలు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహాది విషయాలలో తుది నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరంగా సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగపరంగా ఇబ్బందులు అధిగమించి మంచి పేరు గడిస్తారు. కళాకారులు, పరిశోధకులకు మరింత సానుకూలత ఉంటుంది. 23,24 తేదీల్లో బంధువులు, ఆత్మీయులతో విరోధాలు. దూరప్రయాణాలు ఉంటాయి. ఎంతకష్టించినా ఫలితం అంతగా ఉండదు. గణేశాష్టకం పఠించండి.
కుంభం… (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
వీరికి అన్ని విధాలుగా కలసివచ్చే కాలం. ఏదనుకుంటే అదే విజయవంతంగా సాధిస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో దూసుకుపోయే సత్తా కలిగి ఉంటారు. భవిష్యత్తు బంగారుమయంగా కనబడుతుంది. ఆర్థికపరంగా అదనపు ఆదాయ వనరులు సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. మీ సేవాభావం అందరూ గుర్తిస్తారు. మీరంటే అందరికీ గౌరవం పెరుగుతుంది.జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన ఎదురుకావచ్చు. నిరుద్యోగులు ఊహించనిరీతిలో ఉద్యోగాలు. కొన్ని వేడుకలు సైతం నిర్వహిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో సఫలమవుతారు. వ్యాపారపరంగా ఊహించిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగపరంగా తోటివారి సలహాలు, సాయం స్వీకరిస్తారు. రాజకీయవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులకు విజయాలు వరిస్తాయి. 25,26 తేదీల్లో వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు. అనుకోని ఖర్చులు. సన్నిహితులతో వివాదాలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.
మీనం… (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి)
అన్నింటా విజయకేతనం ఎగురవేస్తారు. ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆర్థికంగా లోటు లేకుండా గడుపుతారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం మరింత ఉత్సాహం నింపుతుంది. మీ ఆశయాల సాధనలో కుటుంబసభ్యుల పాత్ర కీలకం కానుంది. శత్రువులు కూడా మీ మాటకే విలువనివ్వడం విశేషం. పరిస్థితులను అనుకూలంగ మార్చుకోవడంలో సఫలమవుతారు. ఇంట్లో శుభకార్యాలు కొన్ని నిర్వహించే వీలుంది. ఒక సమాచారంతో మీలో ఊహించని మార్పు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడతారు. ఉద్యోగార్ధులు ఉద్యోగాలు పొందే సూచనలు. వ్యాపార పరంగా చిన్న, మధ్యతరహా వ్యాపారులు తమ నైపుణ్యతను నిరూపించుకుంటారు. ఉద్యోగవర్గాలపరంగా సత్తా, నేర్పు చాటుకుంటారు. కళాకారులు, పరిశోధకులు తమ అనుభవాలతో మరింత రాణిస్తారు. 22,23 తేదీల్లో వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు. అనుకోని ఖర్చులు. పనులలో ప్రతిబంధకాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
జ్యోతిష్య రత్న
శ్రీ సింహంభట్ల సుబ్బారావు
–––––––––––––––––––––––––––––