ఐపీఎల్లో ఫిక్సింగ్ జరిపేందుకు ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? మరోసారి ఫ్రాంచైజీలను, ఆటగాళ్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? దీనికి పేరు మోసిన వ్యాపారులు రంగంలోకి దిగారా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు బీసీసీఐ ఓ అలర్ట్ జారీ చేసింది. ఇప్పుడదే ఇన్ని అనుమానాలను తెరపైకి తీసుకొచ్చింది.
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు, ప్లేయర్లు, కోచ్‌లు, వారి సహాయక సిబ్బంది, కామెంటేటర్స్‌కు బీసీసీఐ ఓ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి పంటర్లు, బుకీలతో సంబంధాలు ఉన్నాయి. అతనికి గతంలోనూ ఫిక్సింగ్ చేసిన చరిత్ర ఉంది. అతను మళ్లీ అలాంటి పనులు చేయాలనుకుంటున్నట్టు యాంటీ కరప్షన్ సెక్యూరిటీ యూనిటీ గుర్తించింది. ఖరీదైన బహుమతులకు తోడు బంగారు అభరణాలను ఎరగా వేస్తూ ఫిక్సింగ్ చేసే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. అభిమానిని అంటూ ప్లేయర్లు బస చేసే హోటల్స్‌తో పాటు.. ప్రత్యేక కార్యక్రమాలకు ఇన్వైట్ చేస్తూ ఫిక్సింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది.
మ్యాచ్ ఫిక్సింగ్ జరిగే అవకాశం ఉందని ఏకంగా బీసీసీఐ ప్రకటించడం ఇప్పుడు కలవరం రేపింది. ఇంతకీ ఆ ప్రముఖ హైరదాబాద్ వ్యాపారవేత్త ఎవరు? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.