33.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

ఐపీఎల్‌లో తొలి ‘సూపర్’ మ్యాచ్.. క్యాపిటల్స్ రికార్డ్

ఐపీఎల్‌లో ఢిల్లీ, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ ఫ్యాన్స్‌కు నరాలు తెగె ఉత్కంఠను మిగిల్చిందనే చెప్పాలి. గెలుపు మీదా, మాదా అన్నట్టుగా ఆఖరి వరకు విక్టరీ దోబూచులాడగా.. చివరికి రాజస్థాన్‌ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకొని ఢిల్లీని గెలిపించింది. ఈ సీజన్‌లో జరిగిన తొలి సూపర్ ఓవర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలిచి నిలించింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తుషార్ వేసిన రెండో ఓవర్‌లో పొరెల్ వరుసగా 4,4,6,4,4తో ఏకంగా 23 రన్స్‌ రాబట్టాడు. పవర్‌ ప్లేలో రెండు కీలక వికెట్లు కోల్పోయి కాస్త స్కోర్‌ స్లో అయ్యింది. లాస్ట్‌ మ్యాచ్‌లో ఇరగదీసిన కరుణ్ నాయర్.. ఎలాంటి పరుగులు చేయకుండా రనౌట్ అయ్యాడు. రాహుల్ ఆచి తూచి ఆడటంతో పరుగుల పరుగు ఆగిపోయింది. అయితే అక్షర్ నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో మ్యాచ్‌కు ఊపుతెచ్చాడు. ఆఖర్లో స్టబ్స్, అశుతోష్ ధాటిగా ఆడి.. 188 పరుగుల వరకు తీసుకెళ్లారు.

189 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాయల్స్.. జైస్వాల్, శాంసన్ దూకుడైన ఆటతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. స్టార్క్ వేసిన మూడో ఓవర్‌లో 19 రాబట్టాడు జైస్వాల్. శాంసన్‌ కూడా ధాటిగా ఆడే సమయంలో పక్కటెముకలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇదే సమయంలో జైస్వాల్‌ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు నితిష్ రాణా కూడా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మ్యాచ్‌ మొత్తం రాజస్థాన్‌వైపు టర్న్ అయ్యిందనుకుంటున్న సమయంలో రాణా ఔటవ్వడంతో మ్యాచ్‌ మళ్లీ ఢిల్లీ కంట్రోల్‌లోకి వచ్చింది. ఇక లాస్ట్‌ ఓవర్‌ అయితే హైలేట్ అని చెప్పాలి. చివరి ఆరు బంతులకు 9 పరుగులు అవసరం కాగా.. రాజస్థాన్ 8 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ డ్రా ముగిసింది.

ఇక సూపర్‌ ఓవర్‌లో రాజస్థాన్ భారీగా పరుగులు చేయలేకపోయింది. రెండు రనౌట్‌ కూడా అయ్యాయి. రాజస్థాన్ ఇచ్చిన 12 పరుగుల టార్గెట్‌ను 4 బంతుల్లో ఫినిష్ చేసి సెలబ్రేషన్స్‌ స్టార్ట్ చేశారు ఢిల్లీ ప్లేయర్స్.

సూపర్ ఓవర్‌లో కూడా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో 15 సూపర్ ఓవర్లు జరగగా.. అందులో ఐదుసార్లు DC ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో DCదే గెలుపు. సూపర్ ఓవర్ ద్వారా ఎక్కువ విజయాలు సాధించిన టీమ్‌గా కూడా ఢిల్లీ హిస్టరీ క్రియేట్ చేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com