ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఇద్దరు నాయకులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీద రవిచంద్ర, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఎన్నికైన గాదె శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం రాష్ట్ర శాసన సభ భవనం ఆవరణ లోని శాసన మండలి చైర్మన్ కార్యాలయంలో ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఇద్దరు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శాసన మండలి నియమ నిబంధనలకు సంబంధించిన కిట్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.