22.7 C
Hyderabad
Thursday, November 26, 2026

Live Video

spot_img

వారి మీద ఆశలు వదులుకోవాల్సిందేనా?

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్‌ ప్రమాదం జరిగి 50 రోజులు గడిచాయి. కానీ, ఇప్పటికీ మిగిలిన ఆరుగురు కార్మికుల మృతదేహాలు ఇంకా దొరకడం లేదు. రాత్రింబవళ్ళూ సహాయక బృందాలు శ్రమిస్తున్నా, వాళ్ల ఆనవాళ్లు కనుక్కోవడం మాత్రం గగనంగా మారింది.

దేశంలోని ప్రముఖ సంస్థలు సహాయ చర్యల్లో పాల్గొన్నా, ఆశించిన పురోగతి కనిపించటం లేదు. దాదాపు 12 బృందాలు మూడు షిఫ్టులలో పనిచేస్తున్నా, ఆశలు వదులు కోవాల్సిందే అన్న సంకేతాలే వస్తున్నాయి. దీంతో బాధిత కుటుంబాల్లో అసహనం పెరుగుతోంది. కనీసం మృతదేహాలైనా దొరుకుతాయా? అన్న ఆందోళన నెలకొంది.

ఈ విషాదం ఫిబ్రవరి 22వ తేదీన జరిగింది. ప్రమాద సమయంలో ఎనిమిది మంది టన్నెల్‌లో చిక్కుకుపోయారు. ఇప్పటివరకు రెండు మృతదేహాలే వెలికితీయగలిగారు. మార్చి 9వ తేదీన గురుప్రీత్ సింగ్, మార్చి 25వ తేదీన మనోజ్ కుమార్ మృతదేహాలు బయటికి తీసుకురాగలిగారు. మిగతా ఆరుగురి ఆచూకీ మాత్రం ఇంకా తెలియడం లేదు.

ఇటు.. టన్నెల్ లోపల పనులు క్లిష్టంగా పరిణమించాయి. మట్టి, రాళ్లతో పాటు నీటి ఊట వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. సహాయక బృందాలు చెబుతున్న విషయాలను బట్టి.. ఇప్పటి వరకూ 173 మీటర్ల శిథిలాలు తొలగించగా, మిగిలిన 80 మీటర్లలో మృతదేహాలు ఉండే అవకాశం ఉంది. D1, D2 పాయింట్లుగా గుర్తించిన చోట్ల శకలాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. కానీ, టన్నెల్ పైభాగం నుంచి నీరు రావడం వల్ల రెస్క్యూ మరింత క్లిష్టమవుతోంది.

ప్రభుత్వం ఈ ఆపరేషన్‌కి ప్రత్యేక అధికారిగా శివశంకర్‌ను నియమించింది. ఆయన ఒకవైపు బృందాలను సమన్వయం చేస్తూ, మరోవైపు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గత కొన్ని రోజులుగా స్పెషల్‌ ఆపరేషన్‌లొ వేగం పెరిగిందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం 12 సంస్థలకు చెందిన సిబ్బంది, జిల్లా యంత్రాంగం సహకారంతో 24 గంటలూ పనిచేస్తున్నారు. టన్నెల్‌లో ఉన్న ప్రమాదకర పరిస్థితుల్లోనూ, నిరంతరం ఎదురయ్యే సవాళ్లలోనూ, రెస్క్యూ టీమ్‌లు ముందుకు సాగుతున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com