దట్టమైన నల్లమల అడవుల్లో సలేశ్వరం యాత్ర మొదలయ్యింది. లింగమయ్య స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలు, బైక్‌లు, ఎడ్లబండ్లు, ఆటోలలో ఎలా వీలయితే అలా సలేశ్వరం యాత్రకు భక్తుల రాక మొదలయ్యింది. అయితే, చివరగా నాలుగు కిలోమీటర్లు మాత్రం ఎలాగూ నడిచి వెళ్లాలి. సలేశ్వరం వాటర్ ఫాల్స్‌కు చేరుకున్నాక.. అక్కడున్న గుహలో లింగమయ్య స్వామిని దర్శించుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రకు తరలివస్తున్న భక్తజన సందోహానికి సంబంధించిన ఫోటోలు భాస్కర న్యూస్ పాఠకులకు ప్రత్యేకం.