30.8 C
Hyderabad
Monday, June 29, 2026

Live Video

spot_img

ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు

ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రాముడికి స్వర్ణ కిరీటాలు వచ్చాయి. సీతా రామ లక్ష్మణులకు సుమారు రూ.6.60 కోట్ల విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలు సీతా రామ చంద్రస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా విరాళంగా వచ్చాయి. పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డి తయారు చేయించిన ఈ మూడు కిరీటాలను ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఉదయం ఆలయంలో టీటీడీ చైర్మన్‌, టీటీడీ ఈవో, వేద పండితులకు అంద జేశారు.

దాదాపు 7 కిలో గ్రాముల బంగారంతో ఈ స్వర్ణ కిరీటాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఒంటిమిట్ట శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం ప్రాంగణంలో ఈ స్వర్ణ కిరీటాలను శుక్రవారం ఉదయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామల రావుకు పెన్నా సిమెంట్స్‌ అధినేత ప్రతాప్‌రెడ్డి కుటుంబసభ్యులు అందజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు ఈ స్వర్ణ, వజ్ర కిరీటాలను శ్రీ సీతారామ లక్ష్మణుల మూల మూర్తులకు అలంకరించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com