తెలంగాణలో వాహనదారులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్ట్రేషన్ అయిన అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెంబర్ ప్లేట్లు తీసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30గా నిర్ణయించింది. వాహన యజమానులందరూ తప్పకుండా www.siam.in వెబ్‌సైట్ ద్వారా నెంబర్ ప్లేట్ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సంబంధించి రవాణా శాఖ ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేసింది. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల ధరలు కూడా ప్రభుత్వమే నిర్ధారించింది.
HSRP నెంబర్ ప్లేట్ ధరలు :
టూ వీలర్స్ – ₹320 నుండి ₹380
ఇంపోర్టెడ్ టూ వీలర్స్ – ₹400 నుండి ₹500
ఫోర్ వీలర్స్ – ₹590 నుండి ₹700
ఇంపోర్టెడ్ ఫోర్ వీలర్స్ – ₹700 నుండి ₹860
త్రీ వీలర్స్ – ₹350 నుండి ₹450
కమర్షియల్ వాహనాలు – ₹600 నుండి ₹800
HSRP ఎలా బుక్ చేయాలి? :
www.siam.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి
HSRP Book Now పై క్లిక్ చేయండి
వాహన యజమాని వివరాలు నమోదు చేయాలి
వాహనం కంపెనీని సెలెక్ట్ చేయాలి
వాహనం నంబర్, ఛాసిస్ నంబర్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి
రవాణా శాఖ వీటిని ధృవీకరించిన తర్వాత ప్లేట్ తయారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది
డీలర్ ప్లేట్ ఫిట్‌మెంట్ చేసిన తర్వాత, స్పెషల్ లేజర్ నంబర్‌ను రవాణా శాఖకు అప్‌డేట్ చేస్తారు
వాహన యజములకు ముఖ్య సూచనలు :
మీ వాహనం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, వాహనం సీజ్ కాలేదని, చలానాలు లేవని నిర్ధారించుకోవాలి
నెంబర్ ప్లేట్ బుక్ చేసే సమయంలో www.siam.in వెబ్‌సైట్‌లో నిర్ణీత డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లించాలి
వాహనం ఫిట్‌మెంట్ కోసం డీలర్ వద్ద డేట్ స్లాట్ బుక్ చేసుకోవాలి.
ప్లేట్‌పై హోలోగ్రామ్ స్టిక్కర్ కూడా ఉండాలి
డీలర్లు తమ వద్ద ధరల వివరాలు స్పష్టంగా చూపించాలి
ఏవైనా ఫిర్యాదులు ఉంటే, మూడు వర్కింగ్ డేస్‌లో పరిష్కరించాలి
డీలర్లు వాహన యజమాని ఇల్లు/ఆఫీస్ వద్ద కూడా ఫిట్‌మెంట్ సర్వీసులు ఇవ్వవచ్చు. అయితే, అదనపు చార్జీలు తీసుకుంటారు.
HSRCకి గడువు : సెప్టెంబర్ 30, 2025
01.04.2019కి ముందు నమోదు అయిన వాహనాలకు ఈ గడువు వర్తిస్తుంది
ఈ తేది తర్వాత హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డు మీద వాహనం నడిపితే కేసులు నమోదవుతాయి
నెంబర్ ప్లేట్ లేకుండా బీమా, క్యూసీ సర్టిఫికెట్‌లు జారీ చేయకూడదు
పోలీసులు, ట్రాఫిక్ అధికారులు, రవాణా శాఖ అధికారులు ప్లేట్ లేకపోతే వాహనాలను రోడ్డు మీద నడిపేందుకు అనుమతించరు
2019కి ముందు వాహనాలపై హై సెక్యూరిటీ ప్లేట్ ఉండాలని అన్ని జిల్లాల రవాణా శాఖలకు ఆదేశాలు ఇచ్చారు