రఫేల్ ఫైటర్ జెట్స్.. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పవర్‌ను సుపీరియర్‌గా చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. 4.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఇప్పుడు ఇండియన్ డిఫెన్స్ సెక్టార్లో కీలకం. అందుకే కేంద్రం ఇప్పుడు మరిన్ని ఈ ఫైటర్ జెట్స్‌ను కొనుగోలు చేసేందుకు రెడీ అవుతుంది. ఈసారి నేవీ వర్షన్‌కు చెందిన 26 రఫేల్-M వర్షన్ ఫైటర్ జెట్స్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ డీల్ విలువ రూ.63,000 కోట్లు అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీల్‌ను ఫ్రాన్స్‌తో కుదుర్చుకోనుంది రఫేల్.
2023 జులైలో తొలిసారి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోగా అదే ఏడాది ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని సంప్రదించింది కేంద్రం. ఈ భారీ డీల్ కేవలం ఫైటర్ జెట్స్‌ను కొనుగోలు చేయడం మాత్రమే కాదు.. ఫ్లీట్ మెయింటనెన్స్, లాజిస్టికల్ సపోర్ట్, పర్సనల్ ట్రైనింగ్, కొన్ని పరికరాలను స్వదేశీయంగా ఉత్పత్తి చేసే టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం.. ఇవన్నీ కూడా ఈ డీల్లోనే పొందుపరిచారు.
ఈ నెలాఖరులో ఫ్రెంచ్ ప్రభుత్వ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్న్ ఇండియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. 2031లోపు ఈ ఫైటర్ జెట్స్ అన్నీ కూడా నేవీలో చేరే అవకాశం ఉంది. మొత్తం 26 ఫైటర్ జెట్స్ల 22 సింగిల్ సీటర్ ఫైటర్ జెట్స్కాగా మరో నాలుగు ట్విన్-సీటర్ ఫైటర్ జెట్స్. ఇవన్నీ కూడా INS విక్రాంత్ నుంచి తమ సేవలను అందిస్తాయని తెలుస్తోంది.
ప్రస్తుతం మిగ్ -29కే ఫైటర్ జెట్స్ తమ సేవలను కొనసాగిస్తున్నాయి. అయితే వీటి స్థానంలో రఫేల్‌ను చేర్చాలన్నది కేంద్రం ఆలోచన. ప్రస్తుతం INS విక్రాంత్ నుంచి సేవలందిస్తున్న మిగ్ ఫైటర్ జెట్స్ INS విక్రమాదిత్య నుంచి తమ సేవలను కొనసాగిస్తాయి. రఫెల్ M వర్షన్ అనేది ప్రపంచంలోని అత్యంత ఆధునిక నావల్ ఫైటర్ జెట్స్‌లో ఒకటి. ఇవీ సాఫ్రన్ గ్రూప్ రీఇన్ఫోర్స్డ్ ల్యాండింగ్ గేర్స్‌తో ఉంటాయి. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుకూలంగా ఉంటాయి.
హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి పెరుగుతున్న సమయంలో ఈ డీల్ కుదరడం భారత తీర జలాలకు మరింత రక్షణ పెరిగినట్టే అని చెప్పాలి.