23.9 C
Hyderabad
Wednesday, October 28, 2026

Live Video

spot_img

ఒలింపిక్స్‌లో క్రికెట్.. పోటీలో ఆరు టీమ్స్..

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేశారు. 2028లో లాస్ ఏంజిలెస్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడటం పక్కా అని అధికారిక ప్రకటన వచ్చేసింది. దీంతో 128 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో క్రికెట్ వచ్చి చేరినట్టైంది. చివరగా 1900 సంవత్సరంలో ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండేది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ స్పోర్ట్‌ను చేర్చారు. మెన్స్, ఉమెన్స్ రెండు టీమ్స్‌కు అవకాశం ఇచ్చింది ఒలింపిక్ కమిటీ. ఇప్పుడే కాదు.. 2032లో బ్రిస్బేన్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో కూడా క్రికెట్ ఉంటుందని తేలిపింది కమిటీ.

టీ20 ఫార్మాట్‌లోనే ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. మొత్తం ఆరు టీమ్స్‌కు అవకాశం ఇచ్చారు. ఒక్కో టీమ్‌లో 15 మంది చొప్పున.. మొత్తం 90 మంది ప్లేయర్లకు ఈ అవకాశం దక్కనుంది. అయితే ఏ ప్రాతిపదికన ఈ ఆరు టీమ్స్‌ను సెలెక్ట్ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. బహుశా టీ20 ఫార్మాట్‌లో ఉన్న టాప్ 6 టీమ్స్‌కు అవకాశం ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ ఒలింపిక్స్‌ను హోస్ట్‌ చేసేది అమెరికా కాబట్టి.. ఆ టీమ్‌కు నేరుగా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుత ర్యాకింగ్స్‌ను చూస్తే మెన్స్‌ టీమ్స్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండిస్‌.. ఉమెన్స్‌ టీమ్స్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్, సౌతాఫ్రికా.. టాప్‌ ఫైవ్‌లో ఉన్నాయి. కానీ ఒలింపిక్స్‌కు ఇంకా మూడేళ్ల సమయం ఉంది కాబట్టి.. ఇందులో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.

వన్డే, టెస్ట్‌ ఫార్మాట్‌లు కేవలం 12 దేశాలే ఆడుతున్నా.. టీ20 ఫార్మాట్‌ను మాత్రం వంద దేశాల వరకు ఆడుతున్నాయి. దీంతో సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇక 2028 ఒలింపిక్స్‌లో కొత్తగా 22 మెడల్ ఈవెంట్స్ వచ్చి చేరాయి. అందులో క్రికెట్ ఒకటి. మొత్తంగా 10,500 మంది అథ్లెట్లు ఈసారి పోటీ పడనున్నారు. ఈ మధ్య క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోంది. 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో కూడా ఉమెన్స్ క్రికెట్‌ను చేర్చారు. ఇందులో ఆస్ట్రేలియా గోల్డ్‌ మెడల్ సాధించగా.. ఇండియా సిల్వర్ మెడల్ సాధించింది. ఏసియన్ ఏమ్స్‌లో కూడా మెన్స్, ఉమెన్స్‌ టీమ్స్‌ను చేర్చారు. ఈ రెండింటిలో భారత్ గోల్డ్ మెడల్ సాధించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com