33.1 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట

గవర్నర్‌ వద్ద పెండింగులో ఉన్న బిల్లులు ఆమోదించినట్లే అని తీర్పు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికుమార్‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడులో డీఎంకే పాలనలో ఉన్న ఎంకెస్టాలిన్ ప్రభుత్వం దాదాపు పది బిల్లులను ప్రతిపాదించి ఆమోదం కోసం ఆ బిల్లులను గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి పంపింది. అయితే ఆ పది బిల్లుల్లో ఒక్క బిల్లుకు కూడా గవర్నర్‌ ఆమోదం తెలపలేదు. గవర్నర్‌ బిల్లులు ఆమోదించ కుండా ఉండటంపై తమిళనాడు ప్రభుత్వ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ ను మంగళవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌, జస్టిస్‌ జేబీ పార్ధీవాలాల ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తీరును సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులు ఆమోదించకుండా గవర్నర్‌ రవి చట్ట విరుద్దంగా వ్యవహరించారని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. తక్షణం ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులు గవర్నర్‌ ఆమోదించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌ పది బిల్లులను రిజర్వ్‌ చెయ్యడమనేది చట్ట విరుద్దమని ఆ చర్యను రద్దు చేస్తున్నామని పెండింగ్‌ లో ఉన్న పది బిల్లులకు క్లియరెన్స్‌ ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పది బిల్లులు గవర్నర్‌ ఆమోద ముద్రకు పంపిన తేదీ నుంచి ఆమోదించినట్లుగా పరిగణించడబతాయని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. గవర్నర్‌ దగ్గర పెండింగ్‌ లో ఉన్న బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు సీయం ఎంకెస్టాలిన్‌ హర్షం వెలిబుచ్చారు. ఈ తీర్పు చారిత్రాత్మకమైనదని ఆయన అభివర్ణించారు. ఈ తీర్పు తమిళనాడుకే కాక దేశంలోని అన్ని రాష్ట్రాలకు గర్వకారణమని స్టాలిన్‌ అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com