26.7 C
Hyderabad
Wednesday, April 29, 2026

Live Video

spot_img

మహాయుతి దెబ్బ అదుర్స్ కదూ

మహాయుతి దెబ్బకు మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కాకావికలమైపోయింది. హోరాహోరీగా ఎన్నికల ఫలితాలు ఉంటాయని సర్వేలు చెప్పిన జోశ్యాలు తల్లికిందులై మహాయుతి కూటమి సునామీ సృష్టించింది. కూటమిలోని బీజేపీ, శివసేన, ఎన్సీపీ సాధించిన సీట్లతో కొత్త ఏర్పడబోయే సభలో ఏ రాకీయ పక్షానికి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేకుండా పోయింది. 288 స్థానాలు ఉన్న మహరాష్ట్రా శాసనసభలో ప్రతిపక్ష హోదా పొందాలంటే 29 సీట్లు మినిమన్ రావాల్సి ఉంటుంది. అయిత ఈ ఎన్నికల్లో మహా వికాస్ అఘాఢీ కూటమిలో ఏ రాజకీయ పార్టీ 29 సీట్లు సాధించలేకపోయింది. శనివారం వెలువడిన ఫలితాల్లో ఉద్దవ్ ధాకరే నేతృత్వంలోని శివసేనకు 20 శాసనసభ స్ధానాలు దక్కగా, కాంగ్రెస్ పార్టీకి 16, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 10 సీట్లలో మాత్రమే గెలుపొందాయి. దీంతో ప్రతిపక్ష కూటమిలోని ఏ పార్టీకి మహరాష్ట్రలో కొత్తగా ఏర్పడబోయే శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేకుండా పోయింది. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహాయుతి కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ 132 సీట్లలో పోటీ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇక మిగితా రెండు భాగస్వామ్య పక్షాలైన షిండే వర్గం శివసేన 57 స్థానాల్లో గెలుపొందగా, అజిత్ పవార్ కి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 41 సీట్లు దక్కించుకుంది. ఆసక్తికర విషయం ఏంటంటే మహాయుతి కూటమిలో శివసేన కైవశం చేసుకున్నన్ని సీట్లు మహా వికాస్ అఘాఢీ కూటమిలో ఉన్న మూడు పార్టీలు కలిపితే కూడా అన్ని సీట్లలో గెలవలేకపోయాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com