భద్రాచలంలో శ్రీ రామ నమవి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భద్రాద్రి అంతటా కొత్త శోభ అలుముకుంది. వీధులు, వాడలన్నీ రామ నామం జపం చేస్తున్నాయి. కాసేపట్లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం జరగ బోతోంది. ఈ కల్యాణాన్ని కళ్లారా చూసేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలి వచ్చారు. మొత్తానికి భద్రాచలం ఇప్పుడు జన సముద్రంగా మారిపోయింది. ఇక, కల్యాణోత్సవానికి రాలేక పోయిన వాళ్లు.. ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో ఈ వేడుకలను తిలకించేందుకు సిద్ధమయ్యారు.
మరి.. మహోన్నతమైన సీతారాముల కల్యాణ మహోత్సవం వేళ.. భద్రాద్రి చరిత్రను, ఆ సీతారాముల ఆనవాళ్లను మదిలో మెదిలేలా చేసే కొన్ని అపూర్వ, అపురూపమైన ఛాయా చిత్రాలను తిలకించండి. ఇవి భాస్కర న్యూస్ పాఠకులకు మాత్రమే ప్రత్యేకం….