29.7 C
Hyderabad
Sunday, April 26, 2026

Live Video

spot_img

రాయల్స్ అదుర్స్.. కింగ్స్‌కు షాక్..

వరుస గెలుపులతో జోరు మీదున్న పంజాబ్‌ కింగ్స్‌కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. హ్యాట్రిక్‌ విక్టరీపై ఫోకస్ చేసిన పంజాబ్‌ను 50 పరుగుల ఓడించింది. ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న జైశ్వాల్.. తిరిగి ఫామ్‌లోకి రావడంతో పాటు.. ఆర్చ్‌, సందీప్ శర్మ, తీక్షణ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పంజాబ్‌ను కట్టడి చేసింది. దీంతో ఈ సీజన్‌లో పంజాబ్‌ తొలి ఓటమిని చూసింది.

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ 67, సంజు శాంసన్ 38 పరుగులతో టీమ్‌కి మంచి ఓపెనింగ్ అందించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు ఏకంగా 89 పరుగులు అందించడం.. ఆ తర్వాత రియాన్ పరాగ్ 43 రన్స్ చేసి అదే దూకుడు కొనసాగించాడు. ఆఖర్లో వచ్చిన హెట్మెయర్, ధ్రువ్ జురెల్ కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో 205 పరుగులు చేసింది రాజస్థాన్.

206 పరుగుల టార్గెట్‌తో పంజాబ్‌కు వరుస షాక్‌లు ఇచ్చారు రాయల్ బౌలర్లు. ప్రియాన్ష్‌ ఆర్య డకౌట్‌గా వెనుదిరగగా.. ప్రభు సిమ్రన్ సింగ్ కూడా నిరాశ పరిచాడు. ఇక శ్రేయస్ అయ్యర్‌ను కూడా ఆర్చర్‌ బౌల్డ్ చేయడంతో పీకల్లోతూ కష్టాల్లో పడింది పంజాబ్. అయితే వధేరా మాత్రం 62 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాక్స్ వెల్‌ కూడా 30 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది పంజాబ్. మొత్తానికి 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది పంజాబ్. ఆర్చర్‌కు మూడు వికెట్లు దక్కగా, యుధ్‌వీర్‌, తీక్షణ రెండేసి వికెట్లు తీసి పంజాబ్ ఓటమిని శాసించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com