28.8 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

భారీగా లొంగిపోతున్న నక్సల్స్

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మల్టీ జోన్‌-1 ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి, పోలీసుల ఎదుట లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఎదుట 86 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయారు. పోలీసు బెటాలియన్‌ ఆఫీసులో కొత్తగూడెం మల్టీ జోన్‌-1 ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి సమక్షంలో 86 మావోయిస్టులు లొంగిపోగా, వీరిలో 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు.

ఏసీఎం సభ్యులకు అయితే ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పుల అందిస్తాం. పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున అందిస్తామని స్పష్టం చేశారు మల్టీ జోన్‌-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా సీపీఐ మావోయిస్టుకు చెందిన 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందినవారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ‘ఆపరేషన్‌ చేయూత’ కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు లొంగిపోయారు. వీరికి తక్షణ సాయం కింద రూ. 25 వేలు అందజేయనున్నాం. ఆపరేషన్ చేయూతలో భాగంగా ఇప్పటివరకూ 224 మంది సరెండర్ అయ్యారు. వీరిలో ఇద్దరు డీవీసీఎంలు, 10 మంది ఏసీఎంలు, పీపీసీఎంలు, 25 మంది పార్టీ సభ్యులు, 74 మిలీషియా సభ్యులు, 23 ఆర్పీసీ సభ్యులు, 41 మంది డీకేఎంఎస్, ఏఎంఎస్ సభ్యులు, 31 సీఎన్ఎం సభ్యులు, 17 జీఆర్‌డీలు, ఒక కొరియర్ ఉన్నారు. లొంగిపోయిన వారిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ‘ఆపరేషన్‌ చేయూత’ కార్యక్రమంలో భాగంగా ఈ 86 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఐజీ పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద డబ్బులు కూడా అందజేయనున్నట్లు ఆయన తెలిపారులొంగిపోయిన వారిలో ఏసీఎం సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. లక్ష, మిగతా సభ్యులకు రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పునరావాసంతో పాటు అన్ని ప్రోత్సాహకాలు కూడా అందేలా చూస్తామని వెల్లడించారు. మావోయిస్టుల లొంగుబాటులో కీలక పాత్ర పోషించిన కొత్తగూడెం, సీఆర్‌ఫీఎఫ్‌ పోలీసుల చొరవ అమోఘమని మల్టీజోన్-1 ఐజీ పీ. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

మార్చిలో 64 మంది మావోయిస్టులు లొంగుబాటు

గత నెలలో 64 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారు. తాజాగా మరోసారి భారీ సంఖ్యలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు రావడం శుభపరిణామం. మావోయిస్టు పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలను వదిలిపెట్టి మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఛత్తీస్ గఢ్ లో వరుస ఎన్ కౌంటర్లలో భారీగా మావోయిస్టులు చనిపోతున్నారు. దాంతో సరెండర్ అవుతున్న మావోయిస్టుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ కొనసాగుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టు రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఇటీవల 12 నుంచి 6కి తగ్గినట్లు ప్రకటించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com