34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

పాండ్యా.. ఇది పద్ధతేనా? వర్మ కాంట్రవర్సీపై ఏమన్నాడంటే…

ఎల్‌ఎస్‌జీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆ టీమ్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదస్పదంగా మారింది. తిలక్‌ వర్మ విషయంలో పాండ్యా వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమైంది. మాములుగానే పాండ్యా యాటిట్యూడ్‌పై అనేక మంది విమర్శిస్తుంటారు.. ఇప్పుడు అతను చేసిన పనికి ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి.

చివరి ఓవర్‌లో మ్యాచ్‌ గెలిచేందుకు 22 పరుగులు చేయాల్సి ఉంది ముంబై ఇండియన్స్‌. సరిగ్గా ఇదే సమయంలో తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్‌గా క్రీజును వదిలాడు. నిజానికి వెళ్లాడు అనే కంటే.. పాండ్యా అతడిని పంపించాడని చెప్తే కరెక్ట్. అసలు తిలక్ వర్మ ఎందుకు క్రీజును వదిలేలుతున్నాడనేది ఎవరికి అర్థం కాలేదు. పాండ్యా తప్ప.. స్టేడియంలో ఉన్నవారంతా షాక్ అయ్యారు. ఇన్నింగ్స్‌ పూర్తవ్వడానికి సరిగ్గా ఏడు బాల్స్ ఉండగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది అర్థం కాని విషయం.

నిజానికి ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్సంతా చివరి ఓవర్‌లో ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుందని అంచనా వేశారు. కానీ తిలక్ వర్మ క్రీజును వీడి డగౌట్ వైపు వెళ్తూ కనిపించాడు. తిలక్ వర్మ ఆటతీరు పట్ల హార్దిక్ పాండ్యా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పవర్ హిట్టింగ్ చేయాల్సిన టైమ్‌లో తిలక్‌ వర్మ సింగిల్స్‌ తీయడంపై హార్దిక్ పాండ్యా సీరియస్ అయ్యాడని.. క్రీజు వదిలి వెళ్లాలి అన్నట్లుగా హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు.

ఆ తర్వాత బాల్‌లో ఒక సిక్సర్ బాదినా.. ముంబై ఘోరంగా ఓడింది. దీంతో తిలక్ వర్మను పంపించి విమర్శలు ఎదుర్కున్నాడే తప్ప.. సాధించిందేం లేదనే చెప్పాలి. మరి నిజంగా తిలక్ వర్మ సరిగ్గా ఆడలేదా? అంటే.. అస్సలు కాదనే చెప్పాలి. ఎందుకంటే నిన్న ఎల్‌ఎస్‌జీ టీమ్ బౌలింగ్, ఫిల్డింగ్ అద్భుతమనే చెప్పాలి. వర్మ కొట్టిన అద్భుతమైన షాట్లను బౌండరీ లైన్‌ దాటకుండా అడ్డుకున్నారు. పక్కాగా ఫోర్లు అనుకున్న నాలుగు సార్లు సూపర్బ్ ఫిల్డింగ్ చేశారు.

వర్మ వెళ్లిన తర్వాత పాండ్యా ఏదైనా చేశాడా అంటే ఏమీ లేదు. పోనీ వర్మను పంపించి శాంటర్న్‌ను తీసుకొస్తే అతనేమైనా చేశాడా అదీ లేదు. ఇన్నింగ్స్‌ చివరి ఐదు బాల్స్‌లో వచ్చిన పరుగులు కేవలం మూడే. ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సింది ఆవేశ్‌ ఖాన్‌కే.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఈ విషయంపై మాట్లాడాడు పాండ్యా. మ్యాచ్ ఓడిపోవడానికి బ్యాటర్లే కారణమని ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చాడు పాండ్యా. చేయాల్సిన సమయంలో పరుగులు చేయలేదని.. ఫాస్ట్‌గా ఆడలేదన్నారు. నిజానికి ఇవన్నీ చెబుతున్నప్పుడు పాండ్యా టోన్‌ చాలా యాటిట్యూడ్‌తో కనిపించింది. దీంతో ఫ్యాన్స్ మరింత చిర్రెత్తిపోయారు. అసలు ఓ కెప్టెన్‌కు ఉండాల్సిన లక్షణం ఒక్కటీ లేదంటూ ట్రోల్స్ డోస్ పెంచారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com