27.2 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

స్టాలిన్‌కు షాక్.. నీట్‌ మినహాయింపునకు నో..

వైద్య విద్య కోర్సుల్లో నిర్వహించే నీట్ పరీక్ష విషయంలో స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎగ్జామ్ నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలంటూ చేసిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. దీంతో తమిళనాడు ఆశలు అడియాశలయ్యాయి.

నిజానికి తమిళనాడు ఈ మధ్య కేంద్రం ఏం చెప్పినా.. తమకు అలా కుదరదని తెగెసి చెబుతుంది. మళ్లీ కేంద్రం దక్షిణాది రాష్ట్రాన్ని అవమానిస్తోందంటూ ప్రకటన చేస్తోంది. ఈ బిల్లు విషయంలో కూడా అదే డైలాగ్ రీపిట్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. అన్ని వివరణలు ఇచ్చినా.. నీట్ నుంచి మన రాష్ట్రాన్ని కేంద్రం మినహాయించలేదు.. ఇది అవమానించడమే.. అయినా మా పోరాటాన్ని ఆపము అంటూ అసెంబ్లీలో స్టేట్‌మెంట్ ఇచ్చారు స్టాలిన్.

నిజానికి నీట్‌కు వ్యతిరేకంగా చాలా ఏళ్లుగా పోరాడుతుంది తమిళనాడు. అక్కడ ఎగ్జామ్ పేపర్స్ లీకేజీ, కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం.. ఇవన్నీ అంశాలతో మొత్తం నీట్‌ ఎగ్జామ్‌నే తొలగించాలని నిర్ణయించింది. ఓ బిల్లును రూపొందించింది. ఆ బిల్లును అక్కడి గవర్నర్ తిరస్కరించగా.. మార్పులు చేసి మళ్లీ పంపారు. దీంతో ఆయన బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపారు. కానీ అక్కడ కూడా స్టాలిన్ సర్కార్‌కు నిరాశే మిగిలింది.

ప్రస్తుతం తమిళనాడు తీరు చూస్తుంటే కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకోవడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే హిందీ వివాదం, డీలిమిటేషన్ అంశం పై వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు నీట్ అంశాన్ని కూడా అందులో చేర్చింది. ప్రస్తుతం తమిళనాడుకు ప్రత్యేకత ఉండాలనే లక్ష్యంతో పోరాడుతున్నట్టు తమిళ ప్రజల దృష్టిలో మార్కులు సంపాదించాలని ఆయన కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. దీనికి స్థానికత రంగును పూస్తున్నారు. మరి తమిళ ప్రజలు వీటిపై ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com