రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈ సారి అతను బాలీవుడ్‌ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీటౌన్‌లో కొత్త చర్చకు తెరలేపాయి. ఇంతకీ విజయ్ ఏమన్నాడంటే.. కొన్నేళ్లుగా బాలీవుడ్ తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది… చెప్పుకోదగ్గ గొప్ప సినిమాలను బాలీవుడ్ అందించలేకపోతోంది… కానీ ఆ లోటును తీర్చేందుకు కొత్త డైరెక్టర్లు వస్తారు.. బాలీవుడ్ ఇండస్ట్రీ వారిని ప్రేక్షకులకు అందిస్తున్నాయి.. కానీ వారు ముంబై వారు అయి ఉండరని అనుకుంటున్నా.. ఇవి అతను చేసిన వ్యాఖ్యలు.
నిజానికి ఇందులో నెగటివ్ కామెంట్స్ అయితే ఏం లేవు. ఎందుకుంటే రీసెంట్గా బాలీవుడ్లో హిట్ అయిన బడా సినిమాలన్ని సౌత్ ఇండియా నుంచి వెళ్లి డైరెక్ట్ చేసిన సినిమాలే. అదే సమయంతో తెలుగు, కన్నడ సినిమాలు బాలీవుడ్‌ను షేక్ చేశాయి. నార్త్ ప్రజలు కూడా సౌత్ సినిమాలను చూసేందుకు చాలా ఇంట్రస్ట్ చూపుతున్నారు. అదే విషయాన్ని విజయ్ దేవరకొండ ఓపెన్‌గా చెప్పాడు. మరి దీనిపై బీ టౌన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఈ విషయాలు చెబుతూ బాహుబలి గురించి ముచ్చటించారు విజయ్ దేవరకొండ. బాలీవుడ్ ఇలాంటి సినిమా సౌతిండియాలో రూపొందుతుందని ఊహించి ఉండరని.. ఐదేళ్లు కష్టపడి ఆ సినిమా తీశారని.. అది కనుక అలా హిట్ కాకపోతే చాలా మంది కెరీర్లు ముగిసిపోయేవన్నారు. పోటీ అనేది అన్ని చోట్లా ఉందని.. ప్రతి ఒక్కరూ తమ స్థానం కోసం పోరాటం చేయాలన్నాడు.. బాలీవుడ్ కూడా కొత్త దారులను తప్పకుండా వెతుక్కుంటుందన్నాడు రౌడీ బాయ్.
ఇక విజయ్ నటించిన కింగ్ డమ్ మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా అంచనాలతో వస్తున్న ఈ మూవీ ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందంటున్నారు నిర్మాత నాగవంశీ.