30.7 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

హైదరాబాద్‌లో ఆఫీస్‌ ప్లేస్‌కు పెరిగిన డిమాండ్‌

హైదరాబాద్‌ నగరం రోజు రోజుకూ డెవలప్‌ అవుతోంది. పారిశ్రామిక రంగాలకు కీలకమైన నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. మల్టీనేషనల్ కంపెనీలు తమ ఆఫీసులను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. స్కిల్స్‌ ఉన్న స్టాఫ్‌తో పాటు.. మౌలిక వసతులు కూడా హైదరాబాద్‌లో సరిపడా అందుబాటులో ఉండడంతో తమ వ్యాపార విస్తరణకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దీంతో.. హైదరాబాద్‌లో ఆఫీస్‌ ప్లేస్‌లకు చాలా డిమాండ్‌ పెరుగుతోంది.

ప్రతి యేడాది లక్షల చదరపు అడుగుల ఆఫీసు ప్లేస్‌లు లీజుకు తీసుకుంటున్నారు. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో జనవరి- మార్చి త్రైమాసికంలో చూస్తే ఆఫీసు స్థలాల స్థూల అద్దె ట్రాన్సాక్షన్లు 74 శాతం మేర పెరిగాయి. గత మూడు నెలల్లో 2.82 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్థలాలు అద్దెకు వెళ్లినట్లు ప్రముఖ స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. విదేశీ కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరచడమే డిమాండ్ పెరిగేందుకు కారణమని నివేదిక తెలిపింది. ఈ మేరకు ఇండియా రియల్ ఎస్టేట్ ఆఫీస్‌ అండ్ రెసిడెన్షియల్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడించింది.

2025 తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఆఫీసు స్థలాల మార్కెట్‌కు అసాధారణ గిరాకీ ఉన్నట్లు నివేదిక తెలిపింది. జీసీసీ స్థలాల లీజింగ్ కొత్త గరిష్ఠాలను తాకుతున్నట్లు పేర్కొంది. భారత్‌ను దీర్ఘకాలిక పెట్టుబడి గమ్యస్థానంగా ప్రపంచం గుర్తిస్తోందని తెలిపింది.బెంగళూరు నగరంలో ఆఫీసు స్థలాల అద్దె ట్రాన్సాక్షన్లు మూడు రెట్లు పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. గత ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో 35 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలం అద్దెకు వెళ్లగా ఈసారి 1.27 కోట్ల చదరపు అడుగుల స్థలం అద్దెకు తీసుకున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత హైదరాబాద్ మాహానగరం నిలిచినట్లు నివేదిక వెల్లడించింది.

హైదరాబాద్‌లో గత ఏడాది 30 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాలు అద్దెకు వెళ్లాయి. ఈసారి అది 31 శాతం వృద్ధితో 40 లక్షల చదరపు అడుగులకు చేరినట్లు నివేదిక తెలిపింది. అంటే దాదాపు 9 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాలు అధికంగా అద్దెకు వెళ్లాయి.ఇక పుణె నగరంలో ఆఫీసు స్థలాల అద్దె లావాదేవీల్లో 91 శాతం వృద్ధి కనబడింది. 37 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాలు అద్దెకు వెళ్లాయి. ఇక ముంబై నగరంలో 24 శాతం వృద్ధితో 35 లక్షల చదరపు అడుగులు, చెన్నై నగరంలో 56 శాతం వృద్ధితో 18 లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లింది. ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో గత మూడు నెలల్లో 21 లక్షల చదరపు అడుగులు, అహ్మదాబాద్‌లో 2.2 లక్షల చదరపు అడుగులు, కోల్‌కతాలో 1.6 లక్షల చదరపు అడుగుల స్థలాలు లీజుకు వెళ్లాయి

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com