30.7 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

300 లోడింగ్ అన్నారు.. కానీ జరుగుతన్నదేంటి?

విధ్వంసకర బ్యాటింగ్ లైనప్.. క్రీజులోకి దిగితే పరుగుల వరద పారించే బ్యాటర్లు.. ఒకరికి పోటీగా మరొకరు బౌలర్లపై దండయాత్ర చేసే తత్వం.. ముద్దుగా కాటేరమ్మ కొడుకులు.. ఇది సన్‌ రైజర్స్ హైదరాబాద్‌కు ఉన్న బ్రాండ్ ఈమెజ్. అయితే ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందు నుంచి తొలి మ్యాచ్‌ ముగిసే వరకు ఈ రేంజ్‌కు తగ్గట్టుగానే వారి పర్ఫామెన్స్ జరిగింది. కానీ ఆ తర్వాతే మరేమైందో తెలీదు కానీ.. టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన వారు.. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడారు.  తాజాగా అపోనెంట్, వెన్యూ మారుతుంది కానీ SRH ఫేట్ మాత్రం మారడం లేదు.

నిజానికి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది SRH. తన రికార్డుని తనే బ్రేక్ చేసుకుంది. ఆ మ్యాచ్ చూశాక ఈ సీజన్‌లో 300 క్రాస్ చేయడానికి పెద్దగా టైమ్ పట్టదనుకున్నారు. కానీ ఓపెనింగ్ మాత్రమే అదిరింది. ఆ తర్వాత అంతా బెదరడమే. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే సన్‌రైజర్స్ 80 రన్స్ తేడాతో దారుణంగా ఓడింది. ఈ మ్యచ్‌లో క్లాసెన్ మాత్రమే 33 రన్స్‌‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్లు ఎంత ఘోరంగా ఫెయిలయ్యారో అర్థం చేసుకోవచ్చు.

ఈ వరుస ఓటములకు గేమ్ ప్లానింగ్ సరిగా లేకపోవడం.. బ్యాటర్ల అవేశమే కారణంగా తెలుస్తోంది.  సన్‌రైజర్స్ టాస్ గెలిస్తే బ్యాటింగ్‌కే మొగ్గు చూపుతుంది. కొండంత టార్గెట్‌ని ముందు పెట్టి ప్రత్యర్థి టీమ్ కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీయాలనుకుంటుంది. కానీ కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అలా జరగలేదు. SRH స్ట్రాటజీ మార్చింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో టాస్ గెలిచినా బౌలింగ్‌నే సెలెక్ట్ చేసుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన అనుభవమో లేక మరో వ్యూహమో తెలియదు గానీ రైజర్స్ బౌలింగ్ ఎంచుకోవడం ఫ్యాన్స్‌ను కాస్త షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి.  నిజానికి ఛేజింగ్ అంటే కాస్త ఆచి తూచి ఆడాలి. క్రీజులో కుదురుకోవాలి. బ్యాట్స్‌మెన్ల ఆటతీరు నిలకడగా ఉండాలి. ఓపెనర్లు కొన్ని ఓవర్ల దాకా క్రీజులోనే పాతుకుపోవాలి. కానీ ఛేజింగ్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ ఆడినట్లు అగ్రెసివ్‌గా ఆడితే రిజల్ట్ ఇలాగే ఉంటుందనే అనాలసిస్ వినిపిస్తోంది. ఎందుకంటే 9 పరుగులకే మూడు వికెట్లను సమర్పించుకుంది SRH. నిజానికి 4 వికెట్లు కానీ క్యాచ్ డ్రాప్ చేయడంతో ఈ రికార్డ్ క్రియేట్ కాలేదు.

SRH స్టార్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌, క్లాసెన్ ఇలా అందరూ కొడితే విధ్వంసకర ఇన్నింగ్స్‌లు లేదంటే సింగిల్ డిజిట్. ఇదే ఇప్పుడు SRHను ఇబ్బందుల్లో పడేస్తోంది.

వరుసగా 3 మ్యాచ్‌లు ఓడటంతో SRH ఇప్పుడు గేమ్‌ ప్లాన్‌ మార్చాల్సిన సమయం వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.  టాప్‌ ఆర్డర్ నిలకడగా రాణిస్తేనే ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌ ప్రెజర్ లేకుండా ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది.  ఇక తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న అవి నిజం కావడం లేదు.

ఇక బౌలింగ్‌లో కూడా కొన్ని మార్పులు చేర్పులు తప్పడం లేదనే చెప్పాలి. ఎందుకంటే సరైన టైమ్‌లో స్పిన్నర్లను బరిలోకి దించాలన్న టాక్ వినిపిస్తోంది. అంతేగాకుండా ప్రత్యర్థి, పిచ్‌ను బట్టి ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చాల్సిందే. లేదంటే మరో ఓటమి SRH అకౌంట్‌లో పడక తప్పదనే చెప్పాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com