21.7 C
Hyderabad
Thursday, November 26, 2026

Live Video

spot_img

తిరుపతి టు పళని వయా డిప్యూటీ సీయం క్యాంప్‌ ఆఫీస్‌

  • తిరుపతి నుంచి పళనికి బస్సు సర్వీసు ప్రారంభించిన ఆర్టీసీ
  • మంగళగిరి డిప్యూటీ సీయం క్యాంప్‌ ఆఫీస్‌ ముందు ప్రారంభం
  • సర్వీసును ప్రారంభించిన పవన్‌ కళ్యాణ్‌, మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి

సాధారణంగా ఒక రైలో లేక బస్సో లేక విమాన సర్వీసో కొత్తగా ప్రారంభించినప్పుడు సదరు యాజమాన్యం ఏం చేస్తుంది. అంటే విజయవాడ టు హైదరాబాద్‌ నూతన బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయం తీసుకునప్పుడు ఆ బస్సును విజయవాడలో కదా ప్రారంభించాల్సింది. అలా కాకుండా బస్సును చెన్నై పిలిపించుకుని అక్కడ ప్రారంభోత్సవం చేస్తారా…? ఇప్పుడ ఇటువంటి వ్యవహారమే చేసింది ఏపీఎస్‌ ఆర్టీసీ. ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణ సంస్ధ తిరుపతి నుంచి తమిళనాడులోని పళని సుబ్రహ్మణ్య క్షేత్రానికి నూతన సర్వీసు ప్రవేశపెట్టింది. ఆ సర్వీసు ప్రారంభోత్సవానికి ముహుర్తం కూడా నిర్ణయించింది. వాస్తవానికి తిరుపతి నుంచి పళని బస్సు సర్వీసు నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్. గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చేసిన షష్ట షణ్ముఖ యాత్ర సందర్భంగా పళని సుబ్రహ్మణ్యస్వామిని సందర్శించినప్పుడు అక్కడి స్థానికులు తిరుపతి నుంచి పళని డైరెక్ట్‌ బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ పళనిలో భక్తులకు తిరుపతి నుంచి పళనికి డైలీ సర్వీసు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి వచ్చారు. నాడు పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన హామీ మేరకు ఏపీఎస్‌ ఆర్టీసీ తిరుపతి నుంచి పళనికి బస్సు సర్వీసు మంజూరు చేసి దానిని ఏప్రిల్‌ 3వ తేదీ గురువారం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అభ్యర్ధన మేరకు ఈ బస్సు సర్వీసును మంజూరు చేసిన నేపథ్యంలో ఆయనతోనే దీనిని ప్రారంభించాలని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డితో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా భావించారు. కానీ ఉప ముఖ్యమంత్రి బిజీ ష్కెడ్యూల్‌ కారణంగా బస్సును మంగళగిరిలో ఉన్న డిప్యూటీ సీయం క్యాంప్‌ ఆఫీసు వద్దకు తీసుకు వచ్చి పవన్‌ కళ్యాణ్‌ తో ప్రారంభోత్సవం చేయించారు. తిరుపతి నుంచి పళని వయా మంగళగిరి డిప్యూటీ సీయం క్యాంప్‌ ఆఫీస్‌ మీదుగా ప్రారంభ సర్వీసు వెళ్లడం పట్ల ఏపీ ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com