35.2 C
Hyderabad
Friday, April 24, 2026

Live Video

spot_img

భారతి తీర్ధ స్వామి వజ్రోత్సవాలు

శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ స్వామి వారి 75వ జన్మదినం సందర్భంగా వజ్రోత్సవ మహాసభలు, తిరుపతి శృంగేరి శంకర మఠంలో నిర్వహించారు. శ్రీ అన్నపూర్ణ సమేత కాశి విశ్వేశ్వర శారదాంబ ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే, రాముల వారి గుడి ఉత్తరమాడవీధిలోని శంకరమఠంలో శ్రీ ఆది శంకరాచార్యుల వారికి అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు.
సాయంత్రం లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, సౌందర్య లహరి పారాయణ సుమారు 70 మంది ముత్తైదువులతో ఈ పారాయణ జరిగింది.

ప్రముఖ ప్రవచనకర్త కుప్ప విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో వేద శాస్త్ర పండితుల సభలు నిర్వహించారు. విశ్వనాథ శాస్త్రి.. ఇవాళ ఆదిశంకరాచార్య గురు పరంపర గురించి శృంగేరి శంకరమఠ భారతి తీర్థ స్వామి, విధు శేఖర భారతి స్వామి వార్ల గురించి విశేషంగా ప్రవచనం అందించారు.

శ్రీ భారతీయ తీర్థ స్వామి వారి కృపతో శ్రీ గండ్రకోట లక్ష్మీ మనోహర్ ఈ తిరుపతి శంకర మఠం శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమం మొత్తం ధర్మాధికారి శ్రీ రాళ్లపల్లి రామమూర్తి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాల్లో తిరుపతి శంకర మఠం మేనేజర్ నడింపల్లి కృష్ణ, పూర్ణచంద్ర , సురభి మురళి పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com