39.2 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

అదిరిన ప్రియాంకాగాంధీ రాజకీయ అరంగేట్రం

  • 4,10,000 మెజార్టీతో దూసుకుపోతున్న ప్రియాంక
  • కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం
  • ప్రియాంక నాయకత్వంలో భవిష్యత్తు మాదే అంటున్న కాంగీయులు

నెహ్రూ, ఇందిరల వారసురాలిగా రాజీయాల్లోకి అడుగుపెట్టిన ప్రియాంకాగాంధీ తన రాజకీయ అరంగేట్రాన్ని అదరగొట్టింది. తొలి ప్రయత్నంలోనే రికార్డు మెజార్టీ సాధించి పార్లమెంటులోకి అడుగుపెట్టబోతోంది. ముమ్మూర్తులా ఇందిరాగాంధీని పోలిఉండే ప్రియాంకా గాంధీ చట్టసభలకు ఎన్నిక కావాలనేది సగటు కాంగ్రెస్ కార్యకర్తల ప్రగాఢమైన కోరిక. అయితే ప్రియాంక మాత్రం ఇంతకాలం పెద్దగా క్రియాశీల రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచేవారు కాదు. అయితే మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాయబరేలీ, వయానాడ్ లనుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ వయానాడ్ లోక్ సభ స్ధానానికి రాజీనమా చెయ్యడంతో ఆ స్ధానికి.. మహరాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో కలపి ఉప ఎన్నిక నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు ఈ ఉపఎన్నికలో పోటీ చేసిన ప్రియాంకాగాంధీ రికార్డు స్ధాయిలో 4,10,000 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతోంది. రీసౌండ్ చేసుకుంటూ ప్రియాంక సాధించిన ఈ విజయం పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు విపరీతంగా సంబరపడిపోతున్నారు. అసలు ప్రియాంకాగాంధీ ఎన్నికల బరిలో నిలబడటమే ఆసక్తికర పరిణామమైతే రికార్డు మెజార్టీతో గెలుపొందడం కాంగ్రెస్ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. గత ఎన్నికల్లో అన్న రాహుల్ గాంధీకి వచ్చిన 3.60 లక్షల ఓట్ల మెజార్టీని దాటి 5.60లక్షల పైచిలుకు ఓట్లు సాధించి గొప్ప విజయాన్ని ప్రియాంక తన ఖాతాలో వేసుకున్నారు. ప్రియాంక వయానాడ్ ప్రజలకు ఏస్ధాయిలో నమ్మకం కలిగించి రికార్డు మెజార్టీ సాధించిందో… భవిష్యత్తులో అదే నమ్మకం దేశ ప్రజలందరి వద్దా సాధించి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికార పీఠంపై కూర్చోపెడుతుందని కార్యకర్తలు సంబరపడిపోతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com