31.5 C
Hyderabad
Sunday, June 28, 2026

Live Video

spot_img

టారిఫ్‌లు వచ్చేశాయి.. భారత్‌పై పడే భారం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. చెప్పినట్టుగానే అన్ని దేశాలపై టారిఫ్‌లు విధించారు. కానీ ఇన్నాళ్లుగా చెప్పినట్టు వారు ఎంత టారిఫ్‌ విధిస్తే.. తాము అంతే విధిస్తామన్న ప్రకటనను మాత్రం ఆచరణలో పెట్టలేదు. ఆయా దేశాలు విధించే టారిఫ్‌లలో సగం మాత్రమే విధించారు ట్రంప్. అయితే ఈ విషయంలో మిత్రదేశమా.. శత్రు దేశమా అనేది మాత్రం చూడలేదు ట్రంప్. అందరికి వడ్డించేశారు. అత్యల్పంగా 10 శాతం టారిఫ్‌లు విధిస్తే.. అత్యధికంగా 50 శాతం టారిఫ్‌ విధించారు. అయితే తాము ఈ విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించామంటున్నారు ట్రంప్. మొదట్లో చెప్పినట్టుగా రాయితీతో కూడిన టారిఫ్‌లను విధించామన్నారు ట్రంప్.

ఇక భారత్ విషయానికి వస్తే.. మన దేశంపై 26 శాతం టారిఫ్‌లను విధించారు ట్రంప్. మన దేశం 52 శాతం టారిఫ్‌లను విధిస్తుండగా.. అందులో సగం 26 శాతం టారిఫ్‌ను విధించారు ట్రంప్. భారత్ గురించి అయితే స్పెషల్‌గా చెప్పారు ట్రంప్. ఇండియాపై 26 శాతం టారిఫ్‌లు విధిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. కానీ అమెరికాతో భారత్‌ సరిగా వ్యవహరించడం లేదని ఆయన స్టైల్‌లో చెప్పారు.

చైనాపై 34 శాతం.. ఈయూపై 20 శాతం.. అత్యధికంగా వియత్నాంపై 46 శాతం.. తైవాన్‌పై 32 శాతం.. జపాన్‌పై 24 శాతం.. కంబోడియాపై 49 శాతం, శ్రీలంకపై 44 శాతం.. ఇలా అమెరికాతో వాణిజ్యం చేసే అన్ని దేశాలపై టారిఫ్‌లు విధించారు ట్రంప్. ఈ నిర్ణయాలు వెంటనే అమల్లోకి వస్తాయన్నారు ట్రంప్.

తాము విధించిన టారిఫ్‌లను సమర్థించుకున్నారు ట్రంప్. ఈ రోజును లిబరేషన్‌ డేగా ప్రస్తావించిన ట్రంప్.. అమెరికా మళ్లీ సంపన్న దేశంగా మారబోతుందన్నారు. ఇకపై అమెరికాను దోచుకోవడం ఆగిపోతుందని.. మళ్లీ దేశం ఎదగడం ప్రారంభమైందన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com