36.2 C
Hyderabad
Sunday, April 26, 2026

Live Video

spot_img

అమరావతి – విశాఖ అభివృద్ధిపై కూటమి సర్కార్ దృష్టి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైన అమరావతి, విశాఖపట్నం నగరాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. విశాఖను ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మరోవైపు, అమరావతిని ఆధునిక రాజధానిగా నిర్మించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపెడుతోంది.

గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చినప్పటికీ, ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం కోసం కృషి చేస్తుండగా, మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం ఐటీ అభివృద్ధిపై దృష్టి సారించారని చెబుతున్నారు. రాబోయే ఐదేళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

కూటమి ప్రభుత్వం అమరావతి, విశాఖ అభివృద్ధిని సమన్వయంతో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిపైనా దృష్టి పెట్టిందంటున్నారు. ముఖ్యంగా, విశాఖలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి, కొత్త పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమాలు కొనసాగిస్తోంది.

ఇక, విశాఖను ఐటీ హబ్‌గా, అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెబుతున్నారు. దీంతో స్థానికంగా ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతోందన్న చర్చ జరుగుతోంది. వైసీపీ ఆలోచనలో భాగంగా రాయలసీమలో కర్నూలు పక్కన బెడితే.. ఇటు.. అమరావతి, అటు.. ఉత్తరాంధ్రలో విశాఖను సమానంగా అభివృద్ధి చేసేందుకు కూటమి సర్కారు ప్రణాళికలు తయారు చేసిందంటున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com