29.1 C
Hyderabad
Friday, June 5, 2026

Live Video

spot_img

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్.. మిసైల్స్‌ను మోహరిస్తున్న ఇరాన్

అమెరికా దాడులు చేస్తే మేం చూస్తూ కూర్చుంటామా? మేం కూడా దాడులు చేస్తామంటోంది ఇరాన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో అలర్టైన ఇరాన్.. ఇప్పటికే యుద్ధ ఏర్పాట్లను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీక్రెట్ అండర్ గ్రౌండ్స్‌లో లాంచ్‌ప్యాడ్‌లపైకి మిసైల్స్‌ను మోహరించడం ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మరోసారి మిడిల్ ఈస్ట్‌లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.

అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే బాంబుల వర్షం కురిపిస్తామని అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ పెంచేందుకు కారణమయ్యాయి. ఇప్పటికే సిద్ధం చేసుకున్న మిసైల్స్‌ను మోహరించడం ఇరాన్ ప్రారంభించింది. ఒకవేళ అమెరికా ఏరియల్ స్ట్రైక్స్ చేయడం ప్రారంభిస్తే ఎదురుదాడులు చేసేందుకు సిద్ధమవుతుంది ఇరాన్.

గతకొన్ని రోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్‌కు చేరాయి. అమెరికా ప్రపోజ్ చేసిన అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించపోవడం.. ట్రంప్ బెదిరింపు ధోరణిని బాహటంగానే విమర్శించడం.. అమెరికాతో చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పడం.. మరోవైపు ట్రంప్ హౌతీలపై దాడులకు ఆదేశించడం.. ఇరాన్‌పై దాడులు చేస్తామని చెప్పడం.. ఇలా అన్ని పరిణామాలు రోజురోజుకు ఉద్రిక్తతలు పెంచుతూనే ఉన్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com