- ఆపస్మారక స్ధితిలో తల్లి… పోలీసుల అదుపులో భర్త
- అమీన్పూర్ లో విషాదకర సంఘటన
ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలు అనుమానాస్పద పరిస్ధితుల్లో మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో జరిగింది. చిన్నారు నిద్రలోనే మృతి చెందగా తల్లి నోటిలోంచి నురగలు కక్కుకుంటూ ఆపస్మారక స్ధితిలో పడి ఉంది. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లి పరిస్ధితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అమీన్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా మేడిపల్లికి చెందిన చెన్నయ్య భార్యా, ముగ్గురు పిల్లలతో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతంలోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటూ స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి చెన్నయ్య విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సరికి భార్యా, ముగ్గురు పిల్లలు కూడా నోటి నుంచి నురగలు కక్కుతూ పడి ఉన్నారు. పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ లు ముగ్గురు అప్పటికే మృతి చెంది పడి ఉండగా, భార్య రజిత ఆపస్మారక స్ధితిలో కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటీన పోలీస్ స్టేషన్కు తరలించారు. విషాహారం తిని పిల్లలు మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త చెన్నయ్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తు్న్నారు. కుటుంబ కలహాలతోనే ఈ సంఘటన జరిగి ఉంటుదనే కోణంలో దర్యాప్తు చేస్తు్న్నామని పోలీసులు తెలిపారు. పిల్లల మృతదేహాలను పోస్టుమార్టమ్ కి తరలించామని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక పిల్లలు మృతి చెందడానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని అమీన్పూర్ పోలీసులు తెలిపారు.