ఇప్పటికే సంచలన నిర్ణయాలకు కేరాఫ్‌గా మారిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈసారి తన ఫోకస్ అమెరికా ఎలక్షన్ సిస్టమ్‌పై పెట్టారు. అక్కడి ఎన్నికల వ్యవస్థలో మార్పులు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్, బ్రెజిల్ ప్రస్తావన తీసుకురావడం మరో హైలేట్.
భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటు వేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని.. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా ధ్రువీకరణ పత్రం ఉంటుందన్నారు. ఇకపై అమెరికాలో కూడా ఓటు నమోదు కోసం పౌరసత్వాన్ని చూపించాలనే నిబంధన తీసుకొచ్చారు. ఈ మేరకు ఉత్తర్వలపై ట్రంప్ సంతకం చేశారు.
అంతేకాదు భారత్, బ్రెజిల్ ఓటర్ల బయోమెట్రిక్ వివరాలను డేటాబేస్‌ను అనుసంధానం చేస్తున్నాయని, కానీ అమెరికా మాత్రం పౌరసత్వం కోసం స్వీయ ధృవీకరణపైనే ఆధారపడుతోందన్నారు. ఇకపై ఓటర్లు తప్పనిసరిగా తమ అమెరికా పౌరసత్వాన్ని గుర్తింపుగా చూపించాల్సి ఉంటుంది. అంటే ఇకపై అమెరికా ఎన్నికల్లో ఓటు వేయాలంటే యూఎస్ పాస్‌పోర్ట్ లేదా జనన ధ్రువీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయాలన్నారు.
అంతేకాదు ఓట్ల లెక్కింపు విషయంలోనూ పలు మార్పులు చేయాలంటున్నారు ట్రంప్. ఇప్పుడే కాదు గతంలో కూడా ఇదే విధమైన సూచనలు చేశారు. ఎన్నికల రోజు నాటికి వచ్చే మెయిల్ ఓట్లను మాత్రమే లెక్కించాలని సూచించారు. ప్రస్తుతం ఎన్నికల తర్వాత వచ్చిన బ్యాలెట్ లేదా మెయిల్ ఓట్లను కూడా అంగీకరిస్తున్నారు. ఇది సరైన విధానం కాదంటున్నారు ట్రంప్. జర్మనీ, కెనడా కూడా ఓట్లను లెక్కించేందుకు పేపర్ బ్యాలెట్ల పద్ధతిని పాటిస్తున్నాయని చెప్పారు.