అమెరికానా.. అయితే ఏంటి అంటోంది ఇరాన్. మీ దేశ అణు కార్యక్రమాన్ని నిలిపేసి.. వెంటనే మిసైల్స్‌ను నిర్వీర్యం చేయకపోతే దాడులు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వార్నింగ్‌కు సైలెంట్ కౌంటర్ వేసింది. తమ దేశం నిర్మించి అభివృద్ధి చేసిన మిసైల్ సిటీకి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇరాన్‌కు చెందిన ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఇరాన్ డెవలప్ చేసిన అత్యాధునిక మిసైల్స్ ఓ టన్నెల్లో ఉంచినట్టు కనిపిస్తోంది. కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్స్‌లో అత్యాధునిక క్షిపణులు కనిపిస్తున్నాయి. వాటి సంఖ్య వేలల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇరాన్ ఆర్మీ ఉపయోగించే ఆర్టిలరీ కూడా అందులో కనిపిస్తోంది.
ఈ వీడియో రిలీజ్ చేసిన టైమింగ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ వెంటనే తన మిసైల్ ఉత్పత్తిని నిలిపివేసి.. అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఓ లెటర్‌ను ఆ దేశ సుప్రీం లీడర్ ఖోమెనీకి పంపారు కూడా. కానీ దీనిని ఇరాన్ అంగీకరించలేదు.
అమెరికా చెప్పినట్టు చేస్తే తమ దేశానికి ఎలాంటి భద్రత లేకుండా అవుతుందని.. అప్పుడు విదేశీ శక్తులు తమ దేశంపై దాడులు చేసే అవకాశం ఉందని ఇరాన్ చెబుతోంది. అంతేకాదు తమ మిసైల్ డెవలప్మెంట్, న్యూక్లియర్ ప్రొగ్రామ్ దేశ భద్రతకు చాలా అవసరమని చెబుతోంది ఇరాన్. అందుకే అమెరికాకు కౌంటర్ ఇచ్చేందుకే ఈ వీడియోను రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది.
ఇరాన్ తమ దారికి రాకపోతే మిలటరీ యాక్షన్ ఉంటుందని ఇప్పటికే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే మిడిల్ ఈస్ట్‌లో రెండు క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లను మోహరించారు కూడా. దీనిని బట్టి చూస్తే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని అర్థమవుతుంది. అమెరికా దాడులు చేస్తే ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసంటోంది ఇరాన్.
ఇప్పటికే యెమెన్‌లోని హౌతీలపై అమెరికా ఎయిర్‌స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ దాడుల్లో వంద మందికిపైగా గాయపడగా.. మృతుల సంఖ్య 50 దాటింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత హౌతీలపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. హౌతీలకు చెందిన కీలక స్థావరాలను నాశనం చేశామని అమెరికన్ ఆర్మీ ప్రకటించింది.
మొత్తానికైతే ఇరాన్ ఒక్క వీడియోతో ఇప్పుడు అమెరికాకు కౌంటర్ ఇచ్చింది. మరి దీనిపై అమెరికా యాక్షన్ ఎలా ఉండబోతుందన్నది చూడాలి. అయితే ఈ వీడియోపై కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ మిసైల్ సిటీ అండర్‌గ్రౌండ్‌లోనే ఉన్నా.. మిసైల్స్‌కు ఎలాంటి రక్షణ లేదన్న ప్రచారం మొదలైంది. బై ఎనీ చాన్స్ వీటిపై దాడులు జరిగితే మొత్తం మిసైల్ సిటీనే నామరూపాల్లేకుండా పోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.