పంజాబి చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్ సర్గున్ మెహతా. పంజాబీలో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్. సినీనటిగా బిజీగా ఉన్న సర్గున్ మోడలింగ్ లో రాణిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సర్గున్ తాజాగా షేర్ చేసిన పంజాబీ పరువాల ఫోటోలు అభిమానులను అలరిస్తున్నాయి.
1988లో చండిఘడ్ లో జన్మించిన సర్గున్..కామర్స్ లో డిగ్రీ చేసింది.
90వ దశకంలో పేరు మోసిన బూగివూగి(boogie woogie) కిడ్స్ చాంపియన్స్ డాన్స్ షోలో పాల్గొని సత్తా చాటింది.
ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కాలేజీలో వాణిజ్యంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి, నటనపై దృష్టి పెట్టడానికి ముందు MBA పూర్తి చేసింది.
2011 టెలివిజన్ సిరీస్ ఫుల్వా ఆ తర్వాత 2012లో క్యా హువా తేరా వాదాలో నటించిన సర్గున్ ఇమేజ్మె పెరిగింది.
2013లో కలర్స్ టీవీ డ్రామా సిరీస్ బాలికా వధులో నటించి ప్రముఖ నటిగా స్థానం సుస్థిరం చేసుకుంది.
మెహతా 2009లో జీ టివిలో వచ్చిన 12/24 కరోల్ బాగ్ కార్యక్రమ సహనటుడు రవి దుబేతో డేటింగ్ ప్రారంభించి 2013లో దుబేని వివాహం చేసుకుంది.
హిందీలో కట్ పుత్లీ(cuttputlli) సినిమాలో నటించిన సర్గున్ రెండుసార్లు పంజాబీ ఫిలిం ఫేర్ అవార్డ్స్ సాధించింది.
సినిమాలు, వెబ్ సీరీసులతో బిజీగా ఉన్న సర్గున్ మ్యూజక్ అల్బమ్స్ తో అదరగొట్టింది.
courtesy : instagram