- ఏటీఎం విత్ డ్రాయల్స్ సంఖ్య కుదింపు
- వాడని ఫోన్ నెంబర్లకు యూపీఐ లింక్ ల రద్దు
- రూ. 50వేల చెక్ లకు ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ తప్పనిసరి
- మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఏరియాను బట్టి
- డిజిటల్ బ్యాంకింగ్ సేవలు పకడ్బందీ
- టూ ఫాక్టర్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్
- క్రెడిట్ కార్డుల బెనిఫిట్స్ లో కోత
కేటుగాళ్లు, మోసగాళ్ల బారిన పడకుండా ఉండేదుకు బ్యాంకులు తమ రూల్స్ ను ఏప్రిల్ 1 నుంచి మార్చేస్తున్నాయి. ఇందుకు కస్టమర్ల భద్రతా పరమైన కారణాలొకటికాగా, రెండోది కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కావడం. ఈసారి వచ్చేనెల ఒకటి నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా కస్టమర్లు వీటిపై సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రెడిట్ కార్డు, సేవింగ్స్ ఖాతా నియమాలు, ఏటీఎం విత్ డ్రాలకు సంబంధించి కొన్ని మార్పులను అమల్లోకి తెస్తున్నారు.కస్టమర్లు వీటిపై అవగాహన పెంచుకోకపోతే అదనపు చార్జీల పేరిట సొమ్ము కోత పడుతుంది.
నయా రూల్స్ ఇవే.. ఏటీఎంల విత్ డ్రా కుదింపు
పలు బ్యాంకులు తమ ఏటీఎం విత్ డ్రాలో సవరణలు తీసుకొచ్చాయి. ప్రతీసారీ అందుబాటులో ఉండే ఫ్రీ విత్ డ్రాల సంఖ్యను తగ్గించేశారు.గతంలో అయితే ఐదు సార్ల వరకూ నో చార్జెస్ విధానం అమల్లో ఉండేది. కానీ ఈ ఏప్రిల్ ఒకటనుంచి అది మూడు సార్లకు తగ్గించారు. ఈ పరిమితి దాటిందంటే ప్రతీ లావాదేవీకి రూ.20 నుంచి 25రూపాయల వరకూ చార్జీ పడుతుంది.
మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలంటే
బ్యాంక్ లు తమ మినిమం బ్యాలెన్స్ రూల్స్ ను కూడా మార్పు చేశాయి.సేవింగ్స్ అక్కౌంట్లలో కనీసం ఎంత అమౌంట్ మెయిన్ టెయిన్ చేయాలనేది మనం నివసిస్తున్న ఏరియాను బట్టి ఉంటుంది. అదీ బ్యాంకు ను బట్టి కూడా మారుతుంది. మనం నిర్వహిస్తున్న అక్కౌంట్ టైప్, బ్యాంక్, బ్రాంచ్ లొకేషన్ ( అంటే పట్టణ లేదా గ్రామీణ) ను బట్టి ఉంటుంది. అక్కౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే అదనపు చార్జీలు పడతాయి. ఇది బ్యాంకును అడిగి తెలుసుకుని అంత మొత్తం మెయిన్ టైన్ చేయడం ఉత్తమం.
పాజిటివ్ పే సిస్టమ్ అమలు (పీపీఎస్)
లావాదేవీల భద్రతను మరింతగా పెంచడానికి చాలా బ్యాంకులు వెరిఫికేషన్ విధానాన్ని మరింత కఠినం చేస్తున్నాయి. ఎవరైనా వినియోగ దారుడు రూ. 50 వేల కంటే ఎక్కువ విలువైన చెక్ ను ఎవరైనా ఇస్తే గనక ఆ చెక్ లోని వివరాలను చెక్ ఇచ్చిన వారు ఎలక్ట్రానికల్ గా వెరిఫై చేయాలి. మోసాలను అరికట్టడానికి పీపీఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ వెరిఫికేషన్ లో చెక్ నెంబర్, తేదీ, ఎవరికి ఇస్తున్నారో మరోసారి అధికారుల ముందు నిర్ధారించాల్సిఉంటుంది.
డిజిటల్ బ్యాంకింగ్ మరింత పకడ్బందీ
నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ బ్యాంకింగ్ ప్రమోట్ చేయడానికి చాలా బ్యాంకులు ఇప్పటికే ఆన్ లైన్ సర్వీసులను అందుబాటులోకి తేనున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే చాట్ బాట్ లు అమల్లోకి తెస్తున్నాయి.డిజిటల్ లావాదేవీలను సేఫ్ గా ఉంచడానికి, టు- ఫ్యాక్టర్ అథెన్ టికేషన్,బయో మెట్రిక్ వెరిఫికేషన్ వంటి సెక్యూరిటీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకు రానున్నాయి.
సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో మార్పులు
అనేక బ్యాంకులు తమ తమ సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. వచ్చే నెల ఒకటి నుంచి సేవింగ్స్ అక్కౌంట్లలోని బ్యాలెన్స్ బట్టి పొందే వడ్డీ ఆధారపడి ఉంటుంది.
క్రెడిట్ కార్డు సౌకర్యాల్లో మార్పులు
అనేక బ్యాంకులుతమ క్రెడిట్కార్డులసేవల్లో మార్పులు తెచ్చాయి.ఎస్ బిఐ,ఐడీ ఎఫ్ సీ, ఫస్ట్ బ్యాంక్ లాంటి కొన్ని బ్యాంకులు తమ కో బ్రాండెడ్విస్తారా క్రెడిట్కార్డులకుకొన్ని మార్పులు చేశాయి. ఎస్ బిఐ సింపుల్ క్లిక్ స్విగ్గీ, రివార్డ్స్ ని సగానికి తగ్గించింది. ఎయిర్ ఇండియా సిగ్నేచర్ పాయింట్స్ ను 30 నుంచి 10కి తగ్గించింది. ఐడీఎఫ్ సీ, ఫస్ట్ బ్యాంక్ క్లబ్ విస్తారా మైల్ స్టోన్ బెనిఫిట్స్ ను నిలిపివేస్తుంది.
పనిచేయని నెంబర్ తో యూపీఐ లింక్ ఉంటే బంద్
చాలా కాలం పాటు వాడని ఫోన్ నెంబర్లు యూపీ: అక్కౌంట్లకు లింకై ఉంటే రికార్డుల నుంచి ఈ నెంబర్లను బ్యాంకులు తీసేస్తాయి. కాబట్టి అలా వినియోగంలో లేని ఫోన్ నెంబర్లకు ఉన్న యూపీఐ అక్కౌంట్లు వచ్చే నెల 1 నుంచి బంద్ అయిపోతాయి.