26.5 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

నిమ్స్‌ లో రోబోటిక్‌ సర్జరీ ద్వారా కిడ్నీ మార్పిడి

రోబిటిక్‌ సర్జరీ ద్వారా కిడ్నీ మార్పిడి చేసి హైదరాబాద్‌ లోని ప్రతిష్టాత్మకమైన నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ రోబొటిక్‌ సర్జరీలో ఓ మైలురాయిని చేరుకుంది. రొబొటిక్‌ కిడ్నీ మార్పిడి చేయడం ద్వారా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి పబ్లిక్‌ హాస్పిటల్‌ గా నిమ్స్‌ నిలిచింది. ఈ సర్జరీతో భారతదేశంలో మూత్రపిండ మార్పిడి కోసం రోబోటిక్‌ సహాయక శస్త్ర చికిత్సను నిర్వహించే ఆసుపత్రుల సరసన నిమ్స్‌ కూడా చేరింది.

నల్గొండ జిల్లాకు చెందిన 33 సంవత్సాల ఒక వ్యక్తి కిడ్నీ వ్యాధి చివరిదశలో ఉండి పదేళ్ళుగా పోరాడుతున్నాడు. 2017వ సంవత్సరంలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న అది సక్సెస్‌ కాక బాధపడుతున్నాడు. ఈ దశలో అతనికి రెండో సారి కిడ్నీ మార్పిడి అవమయ్యింది. అత్యంత క్లిష్టతరమైన ఈ శస్త్ర చికిత్సన నిమ్స్‌ యూరాలాజీ విభాగం వైద్యులు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా రొబొటిక్స్‌ సహాయంతో కిడ్నీ మార్పిడి విజయవంతంగా చేశారు.

ఈ రోబోటిక్‌ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిమ్స్‌ యూరాలజీ విభాగం ప్రధాన సర్జెన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్ నేతృత్వంలో నిర్వహించారు. సీనియర్‌ ప్రొఫెసర్‌, హెచ్‌ఓడీ డాక్టర్‌ రామ్‌రెడ్డి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎస్‌ఎస్‌ఎస్‌ ధీరజ్ లు ఆపరేషన్‌లో కీలకపాత్ర పోషించారు. వీరికి డాక్టర్‌ సామ సూరజ్‌ కుమార్‌, డాక్టర్‌ విద్యాసాగర్‌, డాక్టర్‌ చరణ్‌ కుమార్‌, డాక్టర్‌ రామచంద్రయ్య, డాక్టర్‌ రఘువీర్‌, డాక్టర్‌ పూవరసన్‌, డాక్టర్‌ షారుక్‌, డాక్టర్‌ అనంత్‌, డాక్టర్‌ అభిషేక్‌, డాక్టర్‌ అనుపమ, డాక్టర్‌ రాకేష్‌, డాక్టర్‌ మధుసూధన్‌, డాక్టర్‌ నిశాంత్‌, డాక్టర్‌ సృజన్‌, డాక్టర్‌ ఠాగూర్‌, డాక్టర్‌ వేదప్రకాష్‌ వంటి అత్యంత నైపుణ్యం కలిగిన యూరాలజిస్టుల బృందం ఈ రోబోటిక్‌ సర్జరీకి మద్దతుగా నిలబడ్డారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com