- పేషెంట్ కోరిక మేరకు క్రికెట్ కిట్ అందజేత
- అన్నగా అండగా ఉంటానని భరోస
క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ స్పర్శ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఓ యువకుడిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. భూపాలపల్లి జిల్లా పాలిమల మండలం సర్వాయ్ పేట గ్రామానికి చెందిన భౌత్ నితిన్ క్యాన్సర్ బారిన పడి హైదరాబాద్ స్పర్శ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని ఆ జిల్లాకు చెందిన మంత్రిగా శ్రీధర్ బాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి నితిన్ ని పరామర్శించారు. ఈ సందర్భంగా నితిన్ తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, పెద్ద క్రికెటర్ కావాలని కలగన్నానని, నాకో క్రికెట్ కిట్ ఇప్పించండి సార్ అని మంత్రి శ్రీధర్ బాబుని అడిగారు. నితిన్ మాటలకు కళ్ళనీళ్ళు పెట్టుకున్న మంత్రి శ్రీధర్ బాబు వెంటనే అప్పటికప్పుడు ఓ క్రికెట్ కిట్ తెప్పించి నితిన్ కి బహుకరించారు. ఒక అన్నలా నీకు అండగా ఉంటానని నితిన్ కి మంత్రి శ్రీధర్ బాబు ధైర్యం చెప్పారు. ఏ అవసరమున్నా నన్ను సంప్రదించమని నితిన్ తల్లిదండ్రులకు మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.