ఎంఎఫ్ హుస్సేన్.. ఆర్ట్, పెయింటింగ్స్ గురించి కాస్త తెలిసిన వారికైనా ఈ పేరు గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. అంతటి చిత్రకారుడు హుస్సేన్. ఇప్పుడీ చిత్రకారుడు తన ప్రావీణ్యంతో మరోసారి చరిత్రల్లోకెక్కాడు. ఎందుకంటే యాత్ర పేరుతో ఆయన గీసిన చిత్రం రూ.118 కోట్ల రికార్డ్ ధర పలికింది. 14 అడుగుల కాన్వాస్‌పై ఈ చిత్రాన్ని గీసాడు MF హుస్సేన్.
భారతదేశంలో స్వాతంత్ర్యం తర్వాత గ్రామీణ జీవన వైవిద్యాన్ని తెలియజేసేలా 1950లో ఈ చిత్రాన్ని గీసారు హుస్సేన్. ఇది అప్పుడే ఆయన అత్యుత్తమ కళాఖండాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇప్పుడీ చిత్రాన్ని ప్రసిద్ధ వేలం సంస్థ అయిన క్రిస్టీ వేలం వేసింది. మార్చి 19న న్యూయార్క్‌లో ఈ చిత్రాన్ని వేలం వేయగా భారత కరెన్సీ ప్రకారం రూ.118 కోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది.
నిజానికి రెండేళ్ల కిందట ముంబైలో ద స్టోరీ టెల్లర్ అనే చిత్రానికి ఏకంగా రూ.61.8 కోట్ల ధర పలికింది. ఇదే రికార్డు అనుకుంటే.. ఈ రికార్డును బ్రేక్ చేసింది హుస్సేన్ చేతి నుంచి జాలువారిన ఈ చిత్రం. 1954లో ఈ చిత్రాన్ని నార్వేకు చెందిన డాక్టర్ లియాన్ కొనుగోలు చేశారు. అయితే 1964లో ఓస్లో విశ్వవిద్యాలయ ఆస్పత్రికి ఈ చిత్రాన్ని డోనెట్ చేశారు. ఇప్పుడు వేలంలో చిత్రానికి వచ్చిన మొత్తాన్ని కూడా ఓస్లో విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు వినియోగించబోతున్నారు.