34.5 C
Hyderabad
Friday, October 30, 2026

Live Video

spot_img

మంత్రి రాజన్న మాటల్లో నిజమెంత?

కర్ణాటక అసెంబ్లీ వేదికగా ఆ రాష్ట్ర మంత్రి కేఎన్ రాజన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల సారాంశం ఏంటంటే.. జాతీయ స్థాయి నేతలు సహా మొత్తం 48 మంది నేతలు హాని ట్రాప్ బాధితులుగా మారారు. ఇందులో అధికారపార్టీ మంత్రులు, విపక్ష నేతలు కూడా ఉన్నారు అంటూ బల్లగుద్దీ మరీ చెప్పారు ఆ నేత. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ పాలిటిక్స్‌లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.

సీడీలు, పెన్‌ డ్రైవ్‌ల్లో ఆ నేతల అసభ్యకరమైన వీడియోలు ఉన్నాయని.. అవి బయటికి వస్తే పెద్ద దుమారం రేగుతుందంటున్నారు రాజన్న. అంతేకాదు కర్ణాటక పాలిటిక్స్‌లో ఇలాంటి విషయాలు కొత్త కాదంటున్నారు. ఇప్పుడీ మంత్రి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. తాము కూడా సిద్ధంగానే ఉన్నామని చెబుతోంది అధికారపక్షం.

మొత్తానికైతే ప్రజల సమస్యలపై చర్చించాల్సిన నేతలు ఇలా పక్కదారి పట్టించే విషయాలపై పరస్పర విమర్శలు, ఆరోపనలు చేసుకూంటూ కాలం గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్‌ మరికొన్ని నెలల పాటు కొనసాగడం ఖాయం. నిజానికి ఆ మంత్రి అన్నట్టు కర్ణాటకలో ఇలాంటి రాజకీయం అస్సలు కొత్తకాదు. ఎన్నికల ముందు రేవన్న ఇష్యూను ఇంకా దేశ ప్రజలు మర్చిపోలేదు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం.. వాటిని వీడియోలుగా దాచుకోవడం చూశాం. ఇప్పుడు ఇందులోకి కొత్తగా కాంగ్రెస్‌ నేతలు కూడా చేరినట్టు కనిపిస్తోంది ఆ రాష్ట్ర మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే. మరి ఇవి కేవలం ఆరోపణలుగా ఉండిపోతాయా? లేక నిజంగానే విచారణ జరిపి విషయాలను బయటికి తీస్తారా? అనేది చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com