2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను శాసన మండలిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశ పెట్టారు.
అసెంబ్లీలో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రవేశ పెట్టగా.. అదే సమయంలో శాసన మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. బడ్జెట్‌కు సంబంధించిన వివరణాత్మక ప్రసంగం చేశారు.
2025-26 ఏడాదికి గానూ రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను మండలిలో ప్రవేశ పెట్టారు శ్రీధర్ బాబు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఆయా ప్రభుత్వ శాఖల వారీగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధుల గురించి వివరించారు శ్రీధర్ బాబు. అలాగే, ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలకు సంబంధించి కేటాయించిన నిధుల వివరాలపే మంత్రి శ్రీధర్ బాబు మండలిలో సభ్యులందరికీ వివరించారు. శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత శాసన మండలి వాయిదా పడింది.