- ఫ్రెష్ ఫుడ్ లభ్యత తక్కువే
- స్పేస్ లోకి వెళ్లిన కొత్తలో కొన్నాళ్లు తాజా ఫుడ్
- ఆ తర్వాత అంతా డ్రైడ్ స్టఫ్ పైనే జీవనం
- పప్పు ధాన్యాలకు పాల పొడి జత చేసి వాడకం
- నాన్ వెజ్ డ్రైడ్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవచ్చు
- ఏడాదికి సరిపడే ఫుడ్ నిల్వల స్టోరేజ్
- వాటినే హీట్ చేసుకుని, నీరు కలుపుకుని తినడం
అంతరిక్షంలో జీరో గ్రావిటీ కావడం వల్ల మనిషి మనుగడే కష్టం. భూ కక్ఝ్య కి 254 మైళ్లదూరంలో ఉంటున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆస్ట్రోనాట్లు మనలాగా మామూలు భోజనం చేయడానికి కుదరదు. ద్రవాహారం ఒండుకునే వీలుండదు. అందుకే వారి తిండి అలవాట్లు కూడా మార్చేసుకోవాలి.(ఐఎస్ ఎస్) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు అనేక దేశాలకు చెందిన ఆస్ట్రోనాట్లు 25 ఏళ్లనుంచి ఉంటూ మానవ మనుగడకు అవసరమైన ఆక్సిజన్ తదితరాలను కృత్రిమంగా సృష్టించి, పంటలు పండించడం ఎలా అనే అంశంపై ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్నారు.ఈ అంతరిక్ష కేంద్రం మన ఫుట్ బాల్ మైదానం ఎంత ఉంటుందో అంత విశాలంగా ఉంటుంది.దీని నిర్వహణ బాధ్యతలను మాత్రం అమెరికా, రష్యా ఉమ్మడిగా చూసుకుంటున్నాయి.
ఐఎస్ఎస్ లో పనిచేయడం అంటే కృత్రిమ వాతావరణంలో పనిచేయడం. అక్కడ మనలాగా నీటి సౌకర్యం,కమ్మటి భోజనంలాంటివి ఉండవు. ఆస్ట్రోనాట్లు తమ ఫుడ్ హాబిట్స్ సైతం మార్చుకోవాల్సి ఉంటుంది. ద్రవాహారం తీసుకునే ఛాన్స్ ఉండదు. చాలా చాలా తక్కువ. అందుకే డ్రైడ్ ఫుడ్ తీసుకుంటారు.దీనివల్ల వారికి కిడ్నీ స్టోన్స్,దృష్టి పరమైన సమస్యలు తలెత్తుతుంటాయి. అంతేకాదు అక్కడినుంచి తిరిగి వచ్చే టప్పుడు భూ స్థిర కక్ఝ్యలోకి ప్రవేశించాక మన శరీర బ్యాలెన్స్ ను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. సునీతా విలియమ్స్, విల్మోర్ ఇద్దరూ సీనియర్ ఆస్ట్రోనాట్లే.అంతరిక్షంలో ఎలా ఉండాలన్న అంశంపై వారికి చాలా కాలం శిక్షణ కూడా ఇచ్చారు.స్పేస్ స్టేషన్ లో తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించిన సునీతకు కమాండర్ అనే సీనియర్ పొజిషన్ కూడా లభించింది.
9 నెలలు ఏం తిని బతికారు?
అంతరిక్ష కేంద్రంలో నీటి సౌకర్యం తగినంతగా ఉండదు కాబట్టి వారు డ్రైడ్ ఆహారం మాత్రమే తీసుకోవాలి. సునీతా, విల్మోర్ లు ఎక్కువగా పిజ్జా, డ్రైడ్ పాస్తా,రోస్టెడ్ చికెన్,ష్రింప్డ్ కాక్ టెయిల్స్ లాంటివి తిని మనుగడ సాగించారు.వారికి తాజా ఫుడ్ మాత్రం చాలా చాలా తక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా ఆరోగ్యం నిలబెట్టుకోడానికి వెంట తీసుకెళ్లిన పరిమిత మోతాదులో ఉన్నతాజా ఫుడ్‌ను తీసుకుంటూ డైట్ పరమైన ప్రమాణాలను పాటిస్తూ వచ్చారు.అంతేకాదు పప్పు ధాన్యాలను, పాలపొడిని జత చేసుకుని తినేవారు.అలాగే డ్రైడ్ ట్యూనా చేపలు, రోస్ట్ చేసిన చికెన్ తో కడుపు నింపుకునేవారు. నాసా డాక్టర్లు వారి డైట్‌ను, కెలోరీలు, ప్రొటీన్ ఇన్ టేక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన సలహాలు ఇస్తుండేవారు. మొదట వెళ్లిన మూడు నెలల వరకూ వారు తాజా ఫుడ్ నే తీసుకునేవారట. ఆ తర్వాత వెంట తీసుకెళ్లిన పదార్ధాలన్నీ డ్రై అయిపోవడం మొదలు పెట్టడంతో ఇక్కడనుంచే డ్రై ఫుడ్‌ను పంపడం మొదలుపెట్టారు. వెంట తీసుకెళ్లిన పండ్లతో రెండు నెలలు గడపగలిగారు.
ఫుడ్ ఎలా తయారు చేస్తారంటే
ఆస్ట్రో నాట్లకు భూమినుంచే ఉడికించిన గుడ్లు, మాంసాహారం పంపేవారు. అక్కడ వారు మళ్లీ వాటిని వేడి చేసుకుని తినేవారు. అలాగే డీ హైడ్రేట్ చేసిన సూప్స్, స్టూస్, కెసరోల్స్ లను పంపితే స్పేస్ స్టేషన్లో ఉన్న నీటితో వాటిని మిక్స్ చేసుకుని వాడుకునేవారు. స్పేస్ స్టేషన్ లో 530 గ్యాలన్ల ఫ్రెష్ వాటర్ ట్యాంక్ ఉంది. అంతేకాదు ఆస్ట్రో నాట్ల విసర్జితాలను మళ్లీ రీ సైకిల్ చేసి నీటిగా మార్చి కూడా వాడుకునేవారు.వారి చెమట, యూరిన్ లు రీ సైకిల్ చేసి మంచి నీటిగా మార్చి వాడుతుంటారు.
వెయిట్ లాస్ ఫుడ్ లేక కాదు
అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు ఆస్ట్రో నాట్లు బరువు కోల్పోతారు. కానీ అది ఆహారం తక్కువ తీసుకోవడం వల్ల మాత్రం కాదు. అక్కడుండే వాతావరణం వల్ల వెయిట్ లాస్ అవుతుంటారు. అంతేకానీ అక్కడ ఫుడ్ దొరకక మాత్రం కాదు. ఎందుకంటే స్పేస్ స్టేషన్ లో తగినన్ని ఆహార నిల్వలు ఉన్నాయి. ఇక్కడనుంచి అతిధులుగా వెళ్లే వారికి సైతం ఏడాది కాలం పాటు తినేందుకు తగిన ఫుడ్ మెటీరియల్ అక్కడ నిల్వ చేసి ఉంటుంది.స్పేస్ స్టేషన్ లో ప్రతీ ఆస్ట్రోనాట్ కు 3.8 పౌండ్ల ఆహారం అవసరమవుతుంది.దాంతో పాటు ఒక వేళ అనుకోకుండా అక్కడ వారు ఎక్కువ సమయం ఉండాల్సొస్తే అందుకు తగిన ఫుడ్ ను కూడా స్టోర్ చేసి ఉంచుతారు.
వాళ్లిద్దరి బ్యాక్ గ్రౌండ్
సునీతా, విల్మోర్ ఇద్దరూ నేవీ టెస్ట్ పైలెట్లే. ఆ తర్వాత వారు నాసాలో ఆస్ట్రోనాట్లుగా మారారు. 62 ఏళ్ల బుచ్ విల్మోర్ మంచి ఫుట్ బాల్ క్రీడాకారుడు.టెన్నెసేలో స్కూలు,కాలేజ్ రోజుల్లో ఆయన బాగా ఫుట్ బాల్ ఆడేవాడు. అలాగే 59 ఏళ్ల సునీత విలియమ్స్ వేగంగా ఈత కొట్ట గలిగిన సమర్ధురాలు. అంతేకాదు ఫాస్టెస్ట్ రన్నర్ కూడా నీధం, మస్సాచుసెట్స్ లో ఆమె రికార్డులు ఎన్నో సాధించారు.
వాళ్లేం మిస్ అయ్యారంటే
అంతరిక్షంలో ఆస్ట్రోనాట్లు కుటుంబాలకు దూరంగా గడుపుతారు. స్పేస్ లో పరిశొధనల్లొ మునిగి తేలడం వల్ల విల్మోర్ తన చిన్న కుమార్తె స్కూల్ ఫైనల్ చదువును దగ్గరుండి చూసుకోలేకపోయారు. అయితే సునీత మాత్రం తన భర్త, తల్లి తదితరులతో నిరంతరం ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ తో టచ్ లోనే ఉండేవారు.