33.2 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

11మంది యూట్యూబర్ల ఆర్థిక లావాదేవీలపై పోలీసుల దృష్టి

తెలంగాణ పోలీసులు పదకొండు మంది యూట్యూబర్లపై కొరడా ఝుళిపించారు. వాళ్లపై కేసులు నమోదు చేశారు. ఐపీఎస్‌ అధికారి, టీజీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సూచనతో హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్‌ యాప్స్‌ గురించి ప్రమోషన్లు చేస్తున్నందుకు గానూ వీళ్లందరిపైనా పోలీసులు కేసులు పెట్టారు.

తమ యూట్యూబ్‌ ఛానెళ్లు, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్‌ చేస్తున్నారని గుర్తించిన విష్ణుప్రియ, సుప్రిత, రీతూచౌదరి, హర్షసాయి, టేస్టింగ్ తేజ, ఇమ్రాన్ పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే ఐపీఎస్ అధికారి సజ్జనార్.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లకు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

పోలీసులు కేసు పెట్టిన జాబితాలో ఉన్న వాళ్లంతా సోషల్ మీడియా ప్లాట్‌ ఫారాలపై జనాన్ని ప్రభావితం చేస్తున్నట్లు ఈ కేసులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్‌లోనూ కీలక అంశాలను ప్రస్తావించారు. కాగా, తాము కావాలని యాప్స్ గురించి ప్రమోట్ చేయలేదని, పొరపాటు జరిగిందని కొందరు సెలబ్రిటీలు క్షమాపణ కూడా చెప్పారు. సారీ చెబుతూ రీతూ చౌదరి ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇది జరిగిన కొన్ని గంటలకే పోలీసులు షాక్ ఇచ్చారు. 11 మంది సెలబ్రిటీలపై కేసులు కట్టారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా ఈజీగా, భారీగా డబ్బులు సంపాదించొచ్చని కొందరు యూట్యూబర్లు ప్రమోషన్లు చేస్తున్నారు. ఇది నిజమేనని నమ్మి యువత దారి తప్పుతోంది. బెట్టింగ్స్ యాప్స్ కారణంగా చాలా మంది యువకులు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అప్పుల పాలై పోతున్నారు. కొంతమంది అయితే అప్పుల పాలై.. ఆ డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితి లేక బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఎంతో మంది యువకులు ఇలా బెట్టింగ్ యాప్‌ల మూలంగా బలైపోయారు. అయితే, ఇప్పుడు తెలంగాణ పోలీసులు బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లపై కొరడా ఝుళిపించడంతో ఈ యాప్‌ల కారణంగా జనం నష్టపోవడం తగ్గుముఖం పట్టాలని అందరూ కోరుకుంటున్నారు.

అయితే, ఈ కేసులో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్న యూట్యూబర్‌లు, టీవీ ఆర్టిస్టులు, ఇన్ ఫ్లూయెన్సర్లలపై దర్యాప్తు ముమ్మరం చేశామని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఫిర్యాదుకు అనుగుణంగా ఆధారాలను సేకరిస్తున్నామన్నారు. ఆధారాలను బట్టి ఈ 11 మందికి నోటీసులు ఇచ్చి విచారణ చేయడంతో పాటు.. అరెస్ట్‌లు కూడా చేస్తామని తెలిపారు. చట్టపరంగా ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. వారి సొంత లాభాల కోసం బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేసి నిరుద్యోగులు, యువతను ఆర్ధికంగా నిండా మునిగేలా చేయడం సహించరాని నేరమన్నారు. ఈ బెట్టింగ్ యాప్ ల నుంచి ఇన్ ఫ్లూయెన్సర్స్ లు ఆర్ధికంగా ఎంత లాభపడ్డారు. ఎలా డబ్బులు తీసుకున్నారు వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తామన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com