క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ప్రారంభం కావడానికి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. మార్చి 22న కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అయితే మ్యాచ్ ఓపెనింగ్‌కు ముందు ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనుంది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. ఈ సెర్మనీ కళ్లు చెదిరిపోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది.
వరుణ్ ధావన్, శ్రద్దా కపూర్, అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ తమ ఆటపాటలతో సందడి చేయనున్నారు. వరుణ్, శ్రద్దా డ్యాన్స్‌లతో అదరగొట్టేందుకు ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక అరిజిత్, శ్రేయా గురించి అస్సలు ఇంట్రడక్షనే అవసరం లేదు.
లాస్ట్ ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ కంటే గ్రాండ్‌గా ఈసారి ఈవెంట్‌ను ప్లాన్ చేసింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. అప్పుడు సింగర్ సోను నిగమ్, అక్షయ్ కుమార్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అప్పుడు స్టేజ్‌పై అదరగొట్టారు. ఈసారి ఆరేంజ్‌కు ఏం తక్కువ కాకుండా సెలబ్రేషన్స్ ఉండనున్నాయి.