28.1 C
Hyderabad
Monday, October 26, 2026

Live Video

spot_img

భట్టి విక్రమార్క పాదయాత్రకు రెండేళ్లు – మధిరలో సంబరాలు

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో చేపట్టిన పాదయాత్రకు రెండేళ్లు నిండాయి. దీంతో, కాంగ్రెస్ నాయకులు పలు చోట్ల సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పూర్తి చేశారు.

ఈ సందర్భంగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ మాట్లాడుతూ.. మార్చి 16వ తేదీన ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామంలో ప్రారంభమైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర..108 రోజులపాటు విజయవంతంగా కొనసాగి ఖమ్మంలో ముగిసిందన్నారు. 108 రోజుల పాటు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్‌ పార్టీలో సరికొత్త ఊపును తీసుకువచ్చిందన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరోగ్యం క్షీణించినా లెక్కచేయకుండా భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు. రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 నియోజకవర్గాలు, 750 గ్రామాల మీదుగా నిర్విరామంగా 1,350 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారని అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేశారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన ఈ పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించిందన్నారు. పాదయాత్రలో భాగంగా గిరిజనులు, ఆదివాసీలు, బడుగు, బలహీన వర్గాలు, మైనారీటీలు, అట్టడుగు వర్గాలు, అణగారిన ప్రజల సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు. భట్టి విక్రమార్క ప్రజలతో మమేకం అవుతూ, వారికలో ఒకరిగా నిలుస్తూ, సమస్యల పరిష్కారానికి స్వాంతన కల్పిస్తూ యాత్ర కొనసాగించారన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిన నియోజకవర్గాల్లో పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడంతో పాటు.. కేడర్‌లో సరికొత్త జోష్ నెలకొందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలందరికీ ఆప్తుడుగా ఉన్న భట్టి పాదయాత్ర నేతల ఐక్యతకు వేదికగా నిలిచిందని, దాని ఫలితమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగా హనుమంతరావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అద్దంకి రవికుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర రెడ్డి, మండల ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు కోరంపల్లి చంటి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోచేపల్లి సురేష్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఫయాజ్, మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ కోన ధని కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి రామారావు, పారుపల్లి విజయ్ కుమార్, నిడమనూరు వంశీకృష్ణ, పత్తేపరపు సంగయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్లు అల్లాడి గోపాలరావు, మైలవరపు లక్ష్మీ స్వాతి, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, పట్టణ కాంగ్రెస్ నాయకులు తలుపుల వెంకటేశ్వర్లు, మోదుగు బాబు, మాగం ప్రసాద్, కోట నాగరాజు, మొండితోక సుధాకర్, రామారావు, సిద్ధంశెట్టి సందీప్, మైలవరపు చక్రి, యన్నం కోటేశ్వరరావు, తన్నీరు రామకృష్ణ, సూర్యదేవర కోటేశ్వరరావు, సాలిక సురేష్, మెండం ఎంకన్న, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు బాహటం వనజ, వనపర్తి కళావతి, కోమాకుల రమా, కాంగ్రెస్ నాయకులు ఉట్ల రాంబాబు, షేక్ గౌసిద్దీన్, ఎండి రహీం, కరీముల్లా, సంపసాల రామకృష్ణ, గడ్డం ప్రశాంత్ బొల్లె పోగు సత్యానందం, జమీల్ పాష, దూదేకుల జానీ, ఆవుల శీను, గుండా వీరారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క పిఎ శ్రీనివాస్, మధిర పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆదిమూలం శ్రీనివాసరావు దివంగతులయ్యారని వారిని స్మరించుకుంటూ.. వారి ఆత్మలు శాంతించాలని కాంగ్రెస్ నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com