31.1 C
Hyderabad
Monday, October 26, 2026

Live Video

spot_img

మరికొన్ని గంటల్లో సునీత, విల్మోర్ భూమిపైకి

  • భూ వాతావరణానికి అడ్జస్ట్ కావడమే పెద్ద సమస్య
  • రక్తప్రసరణ, హృదయ స్పందన, మెదడు పనితీరుపై ప్రభావం
  • కండరాలక్షీణత, ఎముకల సాంద్రత తగ్గడం
  • ఇన్నాళ్లూ భార రహిత స్థితి, ఇప్పుడు భూమ్యాకర్షణ
  • అంతరిక్షంలో పైకి ప్రసరించే శరీర ద్రవాలు
  • ఆ కారణంగా మెదడులో ద్రవాల నిక్షిప్తత
  • ఫలితంగా కంటి చూపు మందగించడం
  • కంటి ఆకృతిలో మార్పులు తప్పవు
  • ఏకాంతానికి అలవాటు పడి రద్దీ కూడళ్లు తట్టుకోలేరు
  • కొన్నాళ్లు వైద్యుల పర్యవేక్షణ అవసరం
  • అవసరమైతే రిహాబిలిటేషన్ సెంటర్‌ కు తరలింపు

అంతరిక్షంలో పరిశోధనలకు వెళ్లి చిక్కుకున్న భారత సంతతి ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్, అమెరికన్‌ ఆస్ట్రోనాట్‌ విల్మోర్ లు మరికొద్ది గంటల్లో తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు. దాదాపు 9నెలల సుదీర్ఘ సమయం స్పేస్ లో గడిపిన ఆమె భూమిపైకి వచ్చిన తర్వాత భూ వాతవరణానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. బిలయనీర్ ఎలన్ మస్క్ సంస్థకు చెందిన స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ లో వారి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పదిరోజుల పరిశోధనకు అంతరిక్షంలోకి వెళ్లి అనుకోకుండా చిక్కుకు పోయిన సునీత, అమెరికన్ ఆస్ట్రోనాట్‌ బుచ్ విల్మోర్ లు మన భారత కాలమానం ప్రకారం ఈనెల 18న అంటే రేపు ఉదయం 8.45 గంటలకు స్పేస్ ఎక్స్ మిషన్ లోకి ప్రవేశిస్తారు. అంతరిక్ష నౌకలో భూమికి ప్రయాణం 29 గంటలు పడుతుంది. కాబట్టి ఈఆస్ట్రో నాట్లు ఇద్దరూ ఎల్లుండి మధ్యాహ్నం దరిదాపు ఒంటి గంట తర్వాత వారు భూమిని చేరే అవకాశం ఉంది. అంతకు ముందు నలుగురు ఆస్ట్రో నాట్లను తీసుకు వెళ్లిన స్పేస్ ఎక్స్ 10 మిషన్ ఆదివారం అక్కడకు చేరుకుని వారిని, కొన్ని ఆహార వస్తువులను ఆదివారం అక్కడ దింపేసింది. స్పేస్ ఎక్స్ మిషన్ ఆదివారం అక్కడకు చేరుకున్నాక ఐఎస్ ఎస్ తో అనుసంధానం పూర్తయి అది తెరుచుకోగానే ఇక్కడనుంచి బయల్దేరిన నలుగురు ఆస్ట్రో నాట్లు వారిని చేరుకున్నారు. ఒకరినొకరు పరిచయాలు, ఆలింగనాలు చేసుకున్నాక వారికి అప్పగించాల్సిన బాధ్యతలను సునీతా, విల్మోర్ లు అప్పగించేశారు. వారు కొంత అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాక రిటర్న్ జర్నీకి మిషన్  సిద్ధం అయ్యాక సునీత, విల్మోర్ లు వారికి వీడ్కోలు పలికి తిరుగు ప్రయాణానికి సన్నద్ధమయ్యారు. వారు గత జూన్ లోనే రావాల్సి ఉండగా స్పేస్ మిషన్ లో రిపేర్లు రావడం, బ్యాటరీ పనిచేయకపోవడం జరిగాయి.హైడ్రాలిక్ వ్యవస్థ విఫలం కావడంతో వారు వారి ప్రయాణం వాయిదా పడుతూ వస్తోంది.

వచ్చాక భూ వాతవరణం ఒక సమస్య …

అంతరిక్షంలో భూమ్యాకర్షణ శక్తి ఉండదు.కాబట్టి భార రహితస్థితిలో తేలుతూ ఉంటారు. కానీ ఎనిమిది నెలలు ఆ కండిషన్ కు అలవాటు పడిన వారు తిరిగి భూమికి వచ్చాక భూమ్యాకర్షణను తట్టుకోవడం కష్టం.దాంతో వారికి అనేక సమస్యలు వస్తుంటాయి. మైక్రో గ్రావిటీకి అలవాటు పడిన శరీరం భూమి ఆకర్షణలో మళ్లీ గడపాలంటే కొంత సమయం పడుతుంది. వారి కాళ్లు నేలపై ఆనేందుకు సహకరించవు.కండరాలు క్షీణించడం, ఎముకలు గుల్ల బారడం లాంటి సమస్యలతో బాధపడతారు. వారి శరీరం సాధారణ స్థితిని సంతరించుకో వాలంటే కొంత కాలం రిహాబిలిటేషన్ లో ఉండక తప్పదు.రోజుల తరబడి మగతగా ఉంటుంది.బలహీనత వేధిస్తుంది. నడవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. చివరకు మెదడు సైతం భూమ్యాకర్షణకు గురై పని చేయడం కొంచెం కష్టమవుతుంది. కొన్ని రోజుల నుంచి వారాల సమయం పట్టే అవకాశముంది. రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు శరీరంలో ద్రవాలన్నీ స్పేస్ లో ఉన్నన్నాళ్లు వ్యతిరేక దిశలో అంటే పైకి ప్రసరి స్తూ ఉంటాయి. కానీ భూమిపై ల్యాండ్‌ అయ్యాక భూమ్యాకర్షణ వల్ల ఒక్క సారిగా రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులొచ్చి, లో బీపి రావడం,మగతగా ఉండటం, స్పృహ తప్పడం లాంటివి జరుగుతాయి. దీనికి నిరంతర వైద్యుల పర్యవేక్షణ కొన్ని వ్యాయామాలు అవసరం పడతాయి. కంటి సమస్యలు అంతరిక్షంలో ఉన్నప్పుడు శరీరంలో ద్రావకాలన్నీ పైకి ప్రసరిస్తూ ఉంటాయి. ఫలితంగా మెదడు లో కొంత ద్రవం చేరుకుంటుంది. కానీ ఒక్కసారి భూమిపై ల్యాండ్‌ అయ్యాక అంతా రివర్స్ అవుతుంది. దీనివల్ల దృష్టి సమస్యలు వస్తాయి. కళ్లు సరిగా కనపడకపోవడం, బ్లర్ గా కనపడటం లాంటివి జరుగుతాయి. ఆస్ట్రోనాట్ల కళ్లు ఆకృతి కూడా మారుతుంది. దీనిని స్పేస్ ఫ్లైట్‌ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులార్ సిండ్రోమ్ గా పిలుస్తారు.అలాంటి సమయంలో మరిన్ని వైద్య పరీక్షలు, చికిత్సలు అవసరమవుతాయి.

మానసిక అసమతుల్యత

అంతరిక్షంలో అన్ని నెలలు గడిపాక ఒక్కసారిగా భూమిపైకి వస్తే పూర్తిగా వ్యతిరేక వాతావరణం ఉంటుంది. నెలల తరబడి ఏకాంతంగా ఉంటూ ఎవరినీ చూడని వారు సడెన్ గా వేగవంతమైన జీవితానికి, రద్దీ కూడళ్లకు అలవాటు పడటం కష్టమవుతుంది.దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను సైతం తట్టుకోలేరు. ఈ మార్పులను తట్టుకోడానికి ఒక్కోసారి మానసికపరంగా కౌన్సిలింగ్‌ కూడా అవసరం పడుతుంది. చివరగా భూమిపైకి సురక్షితంగా దిగితే చాలదు. పరిమితికి మించి మరింత ఎక్కువ సమయం అంతరిక్షంలో గడపాల్సి రావడం వల్ల వారికి ఎదురయ్యే శారీరక, మానసిక సవాళ్లను ఎదుర్కొనడం అతిపెద్ద సమస్య. రేపు భూమిపై అడుగు పెడుతున్న సునీత, విల్మోర్ లు తమకెదురయ్యే శారీరక మానసికసవాళ్లను వైద్యుల పర్యవేక్షణలో ఎదుర్కొని, అవసరమైతే రిహాబిలిటేషన్ లో ఉండి మామూలు స్థితికి రావాల్సి ఉంటుంది. అంతరిక్షంలో వారు ఇన్నాళ్లు చేసిన యోగాలు,రూపొందించిన కొత్త థియరీలు భవిష్య తరాలకు తప్పని సరిగా ఉపయోగపడతాయి. అలాగేసుదీర్ఘ సమయం స్పేస్ లో ఉండిపోవడం వల్ల కలిగే సమస్యలు కూడా ఇతరులకు తెలుస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com