ఇటీవలి వరకు తెలుగులో వరుస సినిమాలు చేసి యూత్ మది దోచుకున్న కృతి శెట్టి…ఇప్పుడు కోలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. హోలీ సందర్భంగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.చిత్ర పరిశ్రమకు అనేకమంది హీరోయిన్లను అందించిన తులు తెగ, మంగళూరు ఫ్యాక్టరీకి చెందినదే కృతి శెట్టి.
2003లో మంగళూరులో జన్మించిన కృతి శెట్టి..విద్యాబ్యాసం ముంబైలో సాగింది. చిన్నదాని అసలు పేరు కృతి కృష్ణా శెట్టి.
అందరిలాగా మొదట మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. హిందీలో 2019లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘సూపర్ 30’ సినిమాలో విద్యార్థిగా నటించే అవకాశం వచ్చింది.
తెలుగులో ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో రెండో సినిమా నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్‌లో, మూడవ సినిమా నాగచైతన్య హీరోగా నటించిన బంగార్రాజులో హీరోయిన్ గా చేసి టాలీవుడ్ ను మెప్పించింది.
కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన తొలి మూడు చిత్రాలూ వరుసగా విజయం సాధించడంతో ఆమె హ్యాట్రిక్ హీరోయిన్‌గా తెలుగుసిని రంగంలో రికార్డు సృష్టించింది
హిందీలో ఒకటే సినిమా చేసినా తెలుగు, మళయాలం, తమిళంలో తేనెపట్టులా ఆకట్టుకునే కృతి శెట్టి బిజీగా ఉంది.
తమిళ హీరో కార్తీ నటించిన ఓ సినిమాలో కృతి చాలా చిన్న అమ్మాయిగా కనిపించింది. అదే కార్తీతో ఇప్పుడు హీరోయిన్ గా చేస్తోంది.
కార్తీ, కృతి ఇపుడు హీరో హీరోయిన్స్ గా “వా వాథియర్” అనే సినిమాలో నటిస్తున్నారు.. కార్తీ వయస్సు 46 పైనే.. ఇక కృతి శెట్టి వయస్సు కేవలం 21 ఏళ్లే.
courtesy : instagram