31.8 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

బాలకృష్ణ ఇంటి ముందు ఫెన్సింగ్‌ను ఢీకొన్న కారు

హీరో నందమూరి బాలకృష్ణ ఇంటిముందు ప్రహారీ ఫెన్సింగ్‌ను ఓ కారు ఢీకొట్టింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ వన్‌ లో ఉన్న బాలకృష్ణ ఇంటిముందు ఇవాళ తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. మెయిన్ రోడ్డు మీదుగా అతి వేగంగా వెళ్తున్న కారు.. ఒక్కసారిగా బాలయ్య ఇంటి ముందు ఉన్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన కారు మాదాపూర్‌ నుంచి రోడ్‌ నెంబర్‌ 45 మీదుగా జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ సంఘటనలో బాలకృష్ణ ఇంటి ముందు ఉన్న ఫెన్సింగ్‌ కొంత మేర ధ్వంసం అయ్యింది. అలాగే, కారు ముందు భాగం కూడా దెబ్బ తిన్నది. డ్రైవర్‌ అతివేగం, నిద్రమత్తులో కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ సంఘటన జరిగిన సమయంలో బాలకృష్ణ ఇంటిలోనే ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమద సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com