ఐపీఎల్ 2025 సీజన్‌కు కెప్టెన్‌గా అక్షర్ పటేల్ పేరును ఖరారు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌ను రిలీజ్ చేసింది. నిజానికి కేఎల్ రాహుల్ కెప్టెన్ అవుతారనుకున్నారు. కానీ అక్షర్ పటేల్ పేరును అనౌన్స్ చేసింది ఆ ఫ్రాంచైజీ.
నిజానికి అక్షర్ పటేల్ ఢిల్లీ టీమ్‌కు మొదటి నుంచి ఆడుతున్న ప్లేయర్. ఐపీఎల్ మెగా వేలానికి ముందు రూ.16.50 కోట్ల భారీ ధర చెల్లించి అక్షర్‌ను రిటైన్ చేసుకుంది DC. ఆ తర్వాత కేఎల్ రాహుల్‌ను కూడా వేలంలో కొనుగోలు చేసింది. నిజానికి రాహుల్‌కు కెప్టెన్‌గా ఎక్కువగా అనుభవం ఉంది. దీంతో అంతా అతనే కెప్టెన్ అవుతారని ఊహించారు.
ఆసక్తి లేదన్న రాహుల్..
కెప్టెన్సీ విషయంలో తనకు అంతగా ఆసక్తి లేదని.. తాను కేవలం బ్యాటింగ్ ఫోకస్ చేస్తానని టమ్ మేనేజ్‌మెంట్‌కు రాహుల్ చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు రాహుల్ భార్య ప్రస్తుతం ప్రెగ్నెంట్. వైజాగ్‌లో జరిగే మ్యాచ్‌కు రాహుల్ అందుబాటులో ఉండడు. ఐపీఎల్‌లో అన్నీ టీమ్స్ తమ కెప్టెన్స్‌ను అనౌన్స్ చేసినా.. ఢిల్లీ మాత్రం ఆఖరి వరకు వేచిచూసింది. చివరికి రాహుల్ నిర్ణయానికి గౌరవం ఇస్తూ.. అక్షర్ పటేల్ పేరును కెప్టెన్‌గా అనౌన్స్ చేసింది.
అక్షర్ పటేల్ 2019 నుంచి ఢిల్లీ తరుపున ఆడుతున్నారు. 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అక్షర్.. 1,653 పరుగులు చేసిన.. 123 వికెట్లు పడగొట్టాడు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానంటూ ఇప్పటికే ప్రకటించాడు అక్షర్.