29.1 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

స్టార్‌ లింక్‌కు కండిషన్స్ అప్లై అంటున్న కేంద్రం..

బిలియనీర్ ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్ ఇండియాలో ఎంట్రీ ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఎయిర్‌టెల్, జియోలతో ఒప్పందం కూడా చేసుకుంది. తమ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు కేంద్రం వద్ద దరఖాస్తు కూడా చేసుకుంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇండియాలో మీ దుకాణం తెరిచేందుకు కొన్ని కండిషన్స్ ఫాల్ అవ్వాలని చెబుతోంది కేంద్రం. అప్పుడే మీ సేవలను ఇండియాలో ప్రారంభించుకోవచ్చని చెబుతోంది.

ప్రస్తుతం స్టార్‌లింక్ కంట్రోల్ సెంటర్ అమెరికాలో ఉంది. ఇక్కడి నుంచే ఈ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను కంట్రోల్ చేస్తారు. అయితే భారత్‌లో మీ సేవలు ప్రారంభించాలంటే.. ఇక్కడో కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించాలని క్లియర్‌ కట్‌గా చెప్పింది కేంద్రం. ఎందుకంటే ఏదైనా సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కేంద్రం ఆ ఏరియా వరకు ఇంటర్నెట్ సేవలను ఆపేస్తుంది. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే స్టార్‌లింక్ నేరుగా శాటిలైట్ ఆధారిత సేవలు కాబట్టి.. నేరుగా కనెక్ట్ అవుతాయి. వీటిని కంట్రోల్ చేయాలంటే ప్రతిసారి అమెరికాలోని హెడ్‌క్వార్టర్స్‌కు సమాచారం అందించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇండియాలోనే కంట్రోల్‌ సెంటర్ ఏర్పాటు చేసి నిర్వహించేలా ఉండాలని తేల్చి చెప్పింది.

అంతేకాదు.. అత్యవసర పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు స్టార్‌లింక్‌ సేవలను తాత్కాలికంగా కంట్రోల్‌లోకి తీసుకునేలా సెక్యూరిటీ అనుమతులు ఉండాలని కూడా కేంద్రం తెలిపింది. మరి ఈ నిబంధనలపై స్టార్ లింక్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనే దానిపైనే తరువాతి నిర్ణయాలు ఉంటాయి.

నిజానికి ఇవేవి కూడా కొత్త నియమాలు కాదు. స్టార్‌లింక్ కోసం ప్రత్యేకంగా రూపొందించివి కూడా కావు. ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా లాంటి నెట్‌వర్క్‌లు ఇలానే తమ అనుమతులు పొందాయి. స్టార్‌లింక్‌ కూడా ఈ నిబంధనల విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com