- పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ
- సాయంత్ర 4గంటలకు సభకు రానున్న పవన్ కళ్యాణ్
జనసేన జయకేతనం పేరుతో నేడు పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద ఆ పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ ఆవిర్భావను విజయవంతం చేయడం కోసం పార్టీ నాయకులు యావత్తు దాదాపు నెల రోజుల నుంచి కష్టపడుతున్నారు. పార్టీ కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ అభిమానులుఘ పెద్ద సంఖ్యలో ఈ సభకు తరలి వస్తారనే అంచనాలో సభ ప్రాంగణ వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. 250 మందికి పైగా ఆహుతులు కూర్చునే విధంగా సభా వేదికను నిర్మించారు. సభా వేదిక ముందు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాట్లు చేశారు. ప్రాంగణ ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు పెట్టారు. సభ ప్రాంగణంలో ఉన్న ఆహుతులు అందరికీ వేదిక మీద జరుగుతున్న వ్యవహారాలు స్పష్టంగా కనిపించడానికి 15 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాయంత్ర 4 గంటల ప్రాంతంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. రాష్ట్రం నలు చెరుగుల నుంచి పార్టీ కార్యకర్దలు, అభిమానులు సభకు రానున్న సందర్భంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ మొత్తం 12 గంటల పాటు పిఠాపురంతో పాటు కాకినాడ రూరల్ అచ్చంపేట నుంచి శంఖవరం మండలం కత్తిపూడి వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాల పార్కింగ్ కోసం చిత్రాడ పరిసరాల్లో తొమ్మిది చోట్ల పార్కింగ్ స్ధలాలను ఏర్పాటు చేశారు. భారీ జనసందోహం వస్తుందన్న అంచనాతో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సభకు 17 వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చెయ్యడంతో పాటు పరిసరాల్లో 70 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే 15 డ్రోన్లతో నిరంతరం సభా ప్రాంగణాన్ని పర్యవేక్షించనున్నారు.