- ఈనెల 17 లేదా 18 తేదీల్లో భూమి పైకి
- స్పేస్ ఎక్స్ 10 ప్రయాణాన్ని బట్టి తిరుగు ప్రయాణం
- పదినెలలుగా అంతరిక్షంలోనే సునీత
- పదిరోజుల ట్రిప్ కు బయల్దేరి ఆపై అవాంతరాలు
- నాసా మిషన్లన్నీ ఫెయిల్. చివరకు ఎలన్ మస్క్ సాయం
- స్పేస్ ఎక్స్ 10 లో నలుగురు ఆస్ట్రోనాట్ల ప్రయాణం
- స్పేస్ ఎక్స్ 9 క్రూ లో సునీతా, విల్మోర్ ల రాక
అంతరిక్షంలో పదిరోజుల పర్యటనకు వెళ్లి అక్కడ చిక్కుకు పోయిన భారతీయ సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, అమెరికన్ ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ లను ఎట్టకేలకు వెనక్కు తీసుకొస్తున్నారు.అన్నీ అనుకున్నట్లు జరిగితే బిలియనీర్ ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ 10 మిషన్ లో వెనక్కు రానున్నారు.అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నుంచి స్పేస్ ఎక్స్ వెహికల్ అంతరిక్షంలోని నాసా అంతరిక్ష కేంద్రానికి చేరుకుని ఇందులో ఉన్న నలుగురు ఆస్ట్రోనాట్లను అక్కడ దింపి ఆపై 9 ఎక్స్ మిషన్ లో సునీత, బుచ్ విల్మోర్ లను కిందకి తీసుకొస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఎలాంటి అవాంతరం లేకుండా ఉంటే సునీత, బుచ్ విల్మోర్ లు ఈనెల 16 లోగా భూమిని చేరుకుంటారు. నాసా అంతరిక్ష కేంద్రంలో కేవలం పదిరోజులు ఉండి చిన్న పాటి పరిశోధనలు చేసేందుకు 2024 జూన్ 5న వెళ్లిన వీరిద్దరూ తిరుగు ప్రయాణంలో స్పేస్ వెహికల్ కు మరమ్మత్తులు తలెత్తడంతో ఏకంగా పదినెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
ఆలస్యం ఎందుకంటే
స్పేస్ వెహికల్ కు థ్రస్టర్ లోపాలు, డాకింగ్ సమస్యలు తలెత్తాయి. వాటిని రిపేర్ చేసేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు.బోయింగ్ కు ఏమైందన్న దానిపై నాసా విస్తృతంగా పరిశోధనలు చేసింది. చివరకు రిస్క్ తీసుకోకూడదని వారిని క్యారీ చేయకుండా సెప్టెంబర్ లో ఒక్క వెహికల్ మాత్రమే కిందకు దిగింది.
చివరకు ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ క్రూ 9 ద్వారా వారిని కిందకు తేవాలని అమెరికాకు చెందిన నాసా నిర్ణయించింది.నాసా ఆస్ట్రో నాట్లు నిక్ హేగ్, రాస్ కాస్ మస్ లు ఇద్దరు మాత్రమే క్రూ 9లో అంతరిక్షానికి వెళ్లి వారిద్దరిని వెనక్కు తేవాలని నిర్ణయించారు. అంతరిక్షంలో ఆరునెలల పాటు పరిశోధనల నిమిత్తం వెళ్లిన ఈ మిషన్ ఫిబ్రవరిలో వారిని తీసుకుని తిరిగి రావాల్సి ఉంది. కానీ తిరుగు ప్రయాణంలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు నాసా క్రూ 10 బోయింగ్ ను శుక్రవారం పంపేందుకు క్లియరెన్స్ ఇచ్చింది.
సునీత తిరుగు ప్రయాణం ఎప్పుడు?
కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ (మార్చి 12) నలుగురు ఆస్ట్రో నాట్లు బయలు దేరతారు.. అయితే అందుకు ఉద్దేశించిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో కాక ఎండ్యురెన్స్ అనే వాహక నౌక సాయంతో బయల్దేరుతున్నారు. 14,15 తేదీలు రెండు రోజులూ అక్కడ నుంచి రిలీవ్ అయ్యే ఆస్ట్రో నాట్లు కొత్తగా వెళ్లిన వారికి బాధ్యతలు అప్పగించడానికి సరిపోతాయి. ఆ నలుగురిని అక్కడ వదిలేసిన స్పేస్ క్రాఫ్ట్ మార్చి 16న సునీత, బుచ్ విల్మోర్ లతో తిరుగు ప్రయాణం అవుతుంది. క్రూ 10 వెహికల్ ప్రయాణం అనుకున్నట్లుగా దిగ్విజయం అయితే సరే.. ఒకవేళ క్రూ 10 మిషన్ ప్రయాణం ఆలస్యమైతే తిరుగు ప్రయాణం కూడా ఆలస్యం అవుతుంది. ఎలన్ మస్క్ కు చెందిన ఈ స్సేస్ ఎక్స్ క్రూ 10 ఇవాళ బయల్దేర లేకపోతే రేపు అంటే 13న సాయంత్రం 7.35 కి లేదా 14న సాయంత్రం ఏడు గంటలకు బయల్దేరుతుంది. అప్పుడు క్రూ 9 తిరుగు ప్రయాణం ఈనెల 17, లేదా 18 తేదీల్లో ఉండొచ్చు.. మొత్తం మీద సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం ఒకటి రెండు రోజులు ఆలస్యమయినా ఈనెలలో ఖాయంగానే కనిపిస్తోంది.
సునీతా విలియమ్స్ జీతం ఎంతో తెలుసా?
నాసా ఆస్ట్రోనాట్ గా వ్యవహరిస్తున్న సునీతా విలియమ్స్ జీతం ఎంతో తెలుసా? ఏడాదికి కోటిరూపాయల 26 లక్షలు. సాధారణంగా ఆస్ట్రో నాట్ల గ్రేడ్లు రెండు రకాలుగా ఉంటాయి. స్సేస్ మిషన్ అసైన్ మెంట్స్ లో వారు డీల్ చేయగలిగిన సామర్ధ్యం ఆధారంగా ఇది నిర్ణయిస్తారు. ఆస్ట్రోనాట్లకు జీఎస్ -13, జీఎస్-15 అని రెండు గ్రేడ్లుగా ఉంటాయి.జీఎస్ -13 గ్రేడ్ ఆస్ట్రో నాట్లకు ఏడాదికి ఇండియన్ కరెన్సీలో 6.7 నుంచి 8.7 మిలియన్ల మధ్య జీతం ఉంటుంది. అలాగే జీఎస్ -15 గ్రేడ్లోకి సీనియర్ ఆస్ట్రో నాట్లు వస్తారు. వీరికి ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 7 మిలియన్ల నుంచి 12.7 మిలియన్ల రూపాయల మధ్య ఉంటుంది. సునీతా విలియమ్స్ నాసా రికార్డులప్రకారం జీఎస్ గ్రేడ్ 15 కిందకి వస్తారు. ఆమె వార్షిక వేతనం ఏడాదికి దగ్గర దగ్గర కోటి పాతిక లక్షల రూపాయల వరకూ ఉంటుంది. అందరిలాగే నాసా ఆస్ట్రో నాట్లకు కూడా ఇంటి అద్దె అలవెన్సు,కారు లోన్లు, హెల్త్ ఇన్సూరెన్సు సదుపాయం ఉంటుంది.ఆస్ట్రో నాట్లు వృత్తి పరంగా,వ్యక్తిగతంగా కూడా ఇంకా అనేక సదుపాయాలు పొందే వీలుంది. మాజీ నేవీ ఆఫీసర్ గా, మిలటరీలోనూ పనిచేసిన సునీతా విలియమ్స్ అంతరిక్ష పరిశోధనల్లోనూ తనదైన నైపుణ్యం ప్రదర్శించారు. అనేక స్పేస్ మిషన్స్ లో ఆమె పాల్గొన్నారు. విస్తృతమైన ఆ అనుభవమే ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా మంచిపేరు, గుర్తింపు తెచ్చి పెట్టాయి.